బబ్లి బబ్లి గా ఉండే బాలీవుడ్ సుందరి ఆయోషా టకియా( సూపర్ హీరోయిన్). ఆమె మీద ఆశలు పెట్టుకున్న వారికి ఓ దుర్వార్త. ఆమె త్వరలో పెళ్ళికూతురు అవ్వబోతోందిట. ఆమెకు భర్తయ్యే అదృష్టం ఫర్హాన్ అజ్మీ అనే కుర్రాడు దక్కించుకోబోతున్నాడు. అతడేమి పరాయి వాడు కాదుట. చాలా కాలంగా ఆమెతో రాసుకు పూసుకు తిరుగుతున్న బాయ్ ఫ్రెండేట.ఈ మథ్య వాళ్ళిధ్దరూ కలసి గోవాలో రెండు హోటళ్ళు కూడా తెరిచారుట. అంటే బాగా దూర దృష్టి ఉన్న జంట అన్నమాట. అంతేగాక దేశ వ్యాప్తంగా ఉన్న టూరిజం కేంద్రాలలో హోటళ్ళు తెరవాలనే ప్లానులో ఉన్నారట. అలాగే పెళ్ళయినా ఆమెకి భర్త సైడు నుండి సినీ కెరిర్ కి పూర్తి సహాయసహకారాలు అందుతాయట. అసలు ఇప్పుడే ఆమెకు సినీ అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి.మరి పెళ్ళయితే ఇంకేమి ఉంటాయి ఇంతోటి దానికి ఆ కాబోయే భర్త హామీలివ్వటం యేమిటి బడాయి కాకపోతే అంటున్నారు హిందీ పరిశ్రమవారు. ఆమె చేతిలో Jaane Kahan Se Ayie అనే సినిమా ఒకటే ఉంది.
Story first published: Friday, July 17, 2026, 0:54 [IST]