హీరో విష్ణు వివాహం ఎప్పుడంటే...

'ఢీ' చిత్రంతో సక్సెస్ ఫుల్ హీరోగా పరిశ్రమలో నిలదొక్కుకున్నమంచు విష్ణువర్దన్ , ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తె వెరానికాల వివాహం పెద్దల అంగీకారంతో మార్చి 1న హైద్రాబాద్ లో అత్యంత వైభవంగా జరుగనుంది.గచ్చిబౌలీ స్టేడియంలో మూడు రోజుల పాటు కనీవినీ ఎరుగని రీతిలో ఈ వివాహ సంబరాలు జరుగనున్నాయి.
అలాగే పదిరోజుల పరిచయం తర్వాత ఇద్దరి భావాలూ ఒకటేనని గ్రహించి ఒకరిపై మరొకరు ఆరాధన పెంచుకున్నామనీ చెప్పారు. విరానికలో సినీ నటుడ్ని చేసుకోవాలనే ఆలోచన లేదనీ, అయితే ఆమె మనసుకు నచ్చే లక్షణాలన్నీ తనలో కనిపించడంతో తనను కూడా అంతే గాఢంగా ప్రేమించిందనీ అన్నారు. పెద్దల సమ్మతం లేనిదే పెళ్లి చేసుకోరాదని ఇద్దరూ అనుకున్నామనీ, అందుకు తగ్గట్టే ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు పెట్టుకండానే తమ ప్రేమను పెద్దలు ఆశీర్వదించి పెళ్లికి సమ్మతించడం సంతోషంగా ఉందనీ చెప్పారు.
విష్ణు-విరానికాల వివాహానికి పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులంతా విచ్చేయనున్నారు.ప్రస్తుతం విష్ణు వర్ధన్ ..వైవియస్ చౌదరి దర్శకత్వంలో సలీం అనే చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











