»   » కొత్త పెళ్లి కొడుకు అనికూడా చూడకుండా... చైతూ చొక్కా లాగేసిన నాగార్జున!

కొత్త పెళ్లి కొడుకు అనికూడా చూడకుండా... చైతూ చొక్కా లాగేసిన నాగార్జున!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత వివాహం గోవాలో గ్రాండ్‌గా జరిగింది. అక్టోబర్ 6వ తేదీన రాత్రి 11.52 గంటలకు హిందూ సాంప్రదాయ పద్దతిలో, మర్నాడు సాయంత్రం 5.30 గంటలకు క్రైస్తవ సాంప్రదాయంలో చైతు-సమంత దంపతులయ్యారు.

వివాహ వేడుక అనంతరం అక్కినేని కుటుంబం పెళ్లి సంబరాల్లో మునిగి తేలారు. అక్కినేని హీరోలు చేస్తున్న సందడికి దగ్గుబాటి స్టార్స్ కూడా తోడవ్వటంతో పెళ్లి సందడి పీక్స్‌కు చేరుకుంది. నాగార్జున, వెంకటేష్, రానా, అఖిల్, చైతు, సమంత అంతా కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

చైతు చొక్కాలాగేసిన నాగ్

చైతు చొక్కాలాగేసిన నాగ్

పెళ్లి వేడుక అనంతరం జరిగిన పార్టీలో అంతా కలిసి డాన్స్ చేస్తుండగా నాగార్జున.... చైతూ చొక్కా లాగేయడం చర్చనీయాంశం అయింది. ఆ ఫోటో కూడా ఇంటర్నెట్లో లీక్ అయి వైరల్ అయింది. నాగార్జున తన కుమారులతో ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్ లా ఉంటాడనటానికి ఈ ఫోటోయే సాక్ష్యమని అంటున్నారు అక్కినేని అభిమానులు.

చైతూలో సిగ్గు పారద్రోలేందుకే...

చైతూలో సిగ్గు పారద్రోలేందుకే...

అక్కినేని హీరోల్లో సిగ్గు, మొహమాటం ఉన్న వ్యక్తిగా చైతుకు పేరుంది. ఇక పెళ్లి వేడుకలో కూడా చైతు అలానే మొహమాట పడటంతో.... అతన్ని పెళ్లి జోష్‌లోకి దింపేందుకు చొక్కా విప్పేసి డాన్స్ ఫ్లోర్ మీదకు పంపాడు నాగార్జు.

మేనమామతో కలిసి చైతు డాన్స్

మేనమామ వెంకటేష్‌తో కలిసి నాగ చైతన్య డాన్స్. పెళ్లి వేడుకలో ఇద్దరూ ఎంతో హ్యాపీగా గడిపారు.

బ్యూటిఫుల్ వెడ్డింగ్

బ్యూటిఫుల్ వెడ్డింగ్

చైతు, సమంత వివాహం ఎంతో బ్యూటిఫుల్ గా జరిగింది. ఆహ్లాదకరమైన గోవా సముద్ర తీరంలో ఈ దంపతులు సాంప్రదాయ బద్దంగా ఏకమయ్యారు.

ఏడేళ్ల ప్రేమ బంధం, ఏడు అడుగులతో...

ఏడేళ్ల ప్రేమ బంధం, ఏడు అడుగులతో...

2010లో వచ్చిన ‘ఏ మాయ చేసేవె' సినిమాలో సమంత, చైతన్య తొలిసారి కలిసి నటించారు. అలా ఇద్దరి మధ్య జరిగిన పరిచయం ప్రేమగా మారి సరిగ్గా ఏడేళ్లు నిండేలోపు.... ఇద్దరూ మధ్య బమైన వివాహ బంధంతో ఏకమయ్యారు.

కొత్తకోడలు

కొత్తకోడలు

సమంత తన ఇంటి కోడలు అవుతుందనే సంతోషాన్ని ఆపుకోలేక పెళ్లికి కొన్ని గంటల ముందే నాగార్జున అభిమానులతో తన మనసులోని సంతోషాన్ని షేర్ చేసుకున్నారు.

సూపర్ మూమెంట్

సూపర్ మూమెంట్

పెళ్లి అనంతరం గోవా సముద్ర తీరంలో రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమంత, నాగ చైతన్య.

మరుపురాని ఆనంద క్షణాలు

మరుపురాని ఆనంద క్షణాలు

జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఆనంద క్షణాలు ఇలా ఫోటోల రూపంలో బందించబడిన వేళ....

చైతు, రానా

చైతు, రానా

చైతు, రానా చిన్నతనంలో అలా... పెళ్లి వేడుకలో ఇలా....

English summary
While there have been several photos posted by Akkineni Nagarjuna on the much-talked-about wedding of Tollywood couple Samantha-Naga Chaitanya, King Nag shared a picture an hour ago in which he was seen pulling off the shirt of his reluctant son Naga Chaitanya jocularly during a pre-wedding party. Now this picture of Chaitanya is going viral in the social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu