చిత్రాలు: శ్రీహరి ‘వీకెండ్ లవ్’ ప్రారంభం
హైదరాబాద్: శ్రీహరి ప్రధాన పాత్రలో మరో సినిమా ప్రారంభమైంది. అధిత్, సుప్రియ కథానాయకులు. నాగు గవర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రాన్ని శాంతి శ్రీహరి సమర్పణలో దృష్టి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈచిత్రం ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది.
తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్ కొట్టగా, లగడపాటి శ్రీధర్ కెమెరా స్విచాన్ చేసారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి దర్శకుడు వివరిస్తూ...ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేమకథ, కామెడీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. శ్రీహరి పోషిస్తున్న విశ్వామిత్ర పాత్ర ఆయనకు మంచి పేరు తెస్తుంది. మార్చి 7న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు నెలల్లో సినిమాపూర్తి చేసి జూన్ నెలలో విడుదల చేస్తాం' అన్నారు.
ఈ చిత్రంలో ఇంకా ఎంఎస్ నారాయణ, చంద్రమోహన్, రఘుబాబు, హేమ, అనసూయ, ప్రవీణ్, భగవాన్, రవివర్మ, తాగుబోతు రమేష్, ఫిష్ వెంకట్, కాదంబరి కిరణ్, ధన్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ జి.ఎస్.రాజ్, పాటలు: అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, భాగ్యలక్ష్మి, నిర్మాత: మధు, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: నారాయణరెడ్డి, పైట్: డ్రాగన్ ప్రకాష్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నాగు గవర.

‘వీకెండ్ లవ్' మూవీ ప్రారంభోత్సవ దృశ్యాలు.

‘వీకెండ్ లవ్' మూవీ ప్రారంభోత్సవ దృశ్యాలు.

‘వీకెండ్ లవ్' మూవీ ప్రారంభోత్సవ దృశ్యాలు.

‘వీకెండ్ లవ్' మూవీ ప్రారంభోత్సవ దృశ్యాలు.

‘వీకెండ్ లవ్' మూవీ ప్రారంభోత్సవ దృశ్యాలు.

‘వీకెండ్ లవ్' మూవీ ప్రారంభోత్సవ దృశ్యాలు.


Click it and Unblock the Notifications











