నటి రోజాతో స్టెప్పేసిన వృద్ద దర్శకుడు (ఫోటోలు)
హైదరాబాద్ : ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవ ద్వీపం, విచిత్ర సోదరులు లాంటి హిట్ చిత్రాలతో చలన చిత్రం రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు సింగితం శ్రీనివాస రావు ప్రస్తుతం 'వెల్‌కం ఒబామా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
వెల్‌కం ఒబామా చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నటి రోజాతో కలిసి హుషారుగా స్టేజీపై స్పెప్పులేసారు దర్శకుడు సింగితం శ్రీనివాసరావు. 81 ఏళ్ల వయసులోనూ ఆయన దర్శకుడిగా కొనసాగుతుండటం, ఇలా హీరోయిన్లతో స్టెప్పులేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతే కాకుండా....'కురుక్షేత్ర' చిత్రాన్ని 3డి ఫార్మాట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగిన విధంగా తెరకెక్కించాలనేదే తన లక్ష్యమని చెప్పి సినిమా మేకింగ్ పట్ల తనుకు ఉన్న అభిరుచిని, ఇష్టాన్ని వెల్లడించారు సింగీతం శ్రీనివాస రావు.

సింగితం శ్రీనివాసరావు
రోజాతో కలిసి ఉత్సాహంగా స్పెప్పులేస్తున్న వృద్ద దర్శకుడు సింగితం శ్రీనివాసరావు. ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగితం దర్శకత్వంలో శాండిల్ వుడ్ మీడియా పతాకంపై ఎస్. భారతి సమర్పణలో ఎస్. భారతీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం వెల్ కం ఒబామా.

వినోదాత్మక చిత్రం
ఈ చిత్రానికి ‘వెల్ కమ్ ఒబామా' అనే టైటిల్ ఎంత వెరైటీగా ఉంటుందో సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. అయితే ఒబామా అనగానే ఇదేదో రాజకీయ చిత్రం అనుకోవద్దు. ఇది పూర్తి వైవిధ్యంగా సాగే చిత్రం. వినోదాత్మకంగా ఉంటూ సెంటిమెంటుకు కూడా పెద్దపీఠ వేసాం. కథానుగుణంగా దేశ, విదేశీ నటీనటులతో ఇందులో నటిస్తున్నారని దర్శకుడు తెలిపారు.

దాసరి మాట్లాడుతూ..
సినిమా చూసాను. సింగీతంతో ఇలాంటి సినిమా తీసినందుకు నిర్మాతలకు అభినందనలు. హ్యూమన్ ఎమోషన్స్ సినిమాలో బాగున్నాయి. సొంత తల్లికి, అద్దె తల్లికి తేడా చూపించారు. ప్రతి తల్లి, బిడ్డా చూడాల్సిన సినిమా అని దాసరి వ్యాఖ్యానించారు.

అల్లరి నరేష్
సింగితం శ్రీనివాసరావు గారు చేసిని సినిమాల్లో పుష్పక విమానం సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం. కెరీర్లో అలాంటి సినిమా చేయాలని ఉంది అని ప్రముఖ కామెడీ చిత్రాల హీరో అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.

నటీనటులు
వెల్ కం ఒబామా చిత్రంలో ఊర్మిళ, రేచల్, ఎస్తబన్, సంజీవ్, భువనచంద్ర, బలభద్రపాత్రుని రమణి, అనంత శ్రీరామ్, నిరంజని, ఆర్ జె శేఖర్ బాషా నటిస్తున్నారు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











