సింగీతం శ్రీనివాస్ ‘వెల్‌కమ్ ఓబామా’(ఫోటోలు)
హైదరాబాద్: ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగితం దర్శకత్వంలో శాండిల్ వుడ్ మీడియా పతాకంపై ఎస్. భారతి సమర్పణలో ఎస్. భారతీకృష్ణ నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో నిరాడంబరంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సింగితం భార్య కళ్యాణి క్లాప్ ఇచ్చారు. నిర్మాత భారతీ కృష్న తల్లి లక్ష్మీ కాంతం కెమెరా స్విచాన్ చేసారు. తొలి సన్నివేశానికి నిర్మాత తండ్రి కృష్ణ మూర్తి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సింగితం చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ఈ చిత్రానికి 'వెల్ కమ్ ఒబామా' అనే టైటిల్ పెట్టడం జరిగింది. టైటిల్ ఎంత వెరైటీగా ఉంటుందో సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. అయితే ఒబామా అనగానే ఇదేదో రాజకీయ చిత్రం అనుకోవద్దు. ఇది పూర్తి వైవిధ్యంగా సాగే చిత్రం. వినోదాత్మకంగా ఉంటూ సెంటిమెంటుకు కూడా పెద్దపీఠ వేసాం. కథానుగుణంగా దేశ, విదేశీ నటీనటులతో ఇందులో నటిస్తున్నారు.
నేను గతంలో నాగిరెడ్డి-చక్రపాణి వంటి క్రమశిక్షణ గల నిర్మాతల దగ్గర పని చేసాను. అదే క్రమ శిక్షణ, పట్టుదల, హార్డ్ వర్క్ ఈ నిర్మాతల్లో నేను గమనించాను. గతంలో వారు ఎంతో శ్రమపడి విజయవంతంగా నిర్వహించిన టీవీ సీరియళ్ల గురించి నాకు తెలుసు. అలాంటి కమిట్ మెంట్ ఉన్న నిర్మాతలతో పని చేయడం చాలా ఆనందంగా ఉందని సింగితం చెప్పారు.
నిర్మాత భారతీకృష్ణ మాట్లాడుతూ... 'సింగితం లాంటి గొప్ప దర్శకుడితో మా మొదటి సినిమా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. కథానుగుణంగా అచ్చమైన గ్రామీణ నేపథ్యం కోసం ఇక్కడ షూటింగ్ ప్రారంభించాం. మొదటి షెడ్యూల్ మార్చి 2 వరకు ఇక్కడే ప్లాన్ చేసాం. హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో 2,3 షెడ్యూల్ ప్లాన్ చేసాం. మా బేనర్ లో మేం ప్రయోగాత్మకంగా వినూత్నమైన సీరియళ్లను గతంలో నిర్మించాం. ఆ తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నమిది. టైటిల్ లో ఉన్న వైవిధ్యం చిత్రంలో కూడా ఉంటుంది' అని తెలిపారు.

వెల్‌కమ్ ఒబామా మూవీ ఓపెనింగ్ ఫోటోలు.

వెల్‌కమ్ ఒబామా మూవీ ఓపెనింగ్ ఫోటోలు.

వెల్‌కమ్ ఒబామా మూవీ ఓపెనింగ్ ఫోటోలు.

వెల్‌కమ్ ఒబామా మూవీ ఓపెనింగ్ ఫోటోలు.
ఈ చిత్ర ప్రారంభోత్సవంలో నటీనటులు రేచల్(యు.కె), ఊర్మిళ, సంజీవ్, నిరంజని తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎస్.దర్శన్, రచనా సహకారం: రోహిణి, ఆర్ట్: వర్మ, నిర్మాత: ఎస్. భారతీకృష్ణ, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: సింగితం శ్రీనివాసరావు.


Click it and Unblock the Notifications











