నువ్వు ఒక అమ్మకి పుట్టిన వాడివేనా??? లక్ష్మీ ప్రసన్న
నందమూరి-ఎన్ బి కే అనే పేరుతో ట్విట్టర్ లో ఓ వల్గర్ మెసేజ్ తాప్సీకి వెళ్ళింది. ఈ మెసేజ్ లో "నాతో వస్తావా..నీకెంత కావాలి...' అంటూ మరింత ఘాటైన పదజాలం ఉంది. అది ఫేక్ 'ట్విట్టర్' ఎకౌంట్ అయినా లక్ష్మీ ప్రసన్న ఈ ట్వీట్ పై ట్విట్టర్ లో మండిపడ్డారు. యు క్రాప్ చీప్ షిట్. నువ్వు ఒక అమ్మకి పుట్టిన వాడివేనా అయినా ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఉండాలి?' అంటూ మండిపడింది. తమ బేనర్ నిర్మించిన 'ఝుమ్మంది నాదం' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన తాప్సీపై మోహన్‌బాబు కుటుంబానికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. తాప్సీ కూడా మోహన్‌బాబు కుటుంబంపట్ల ఎంతో ఆత్మీయంగా ఉంటారు. అందుకే లకీప్రసన్న సదరు ట్విట్టర్‌లో ఉన్న మెసేజ్‌ను చూసి పై విధంగా స్పందించింది. తాప్సీ ప్రస్తుతం విష్ణు సరసన ఒక సినిమా, ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో ధనుష్ సరసన తాప్సీ నటించిన 'ఆడుకలమ్' చిత్రం త్వరలో విడుదల కానుంది. కోలీవుడ్ నుంచి కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











