twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జక్కన్న మావోడు.. ఊరి పేరు నిలబెట్టాడు.. రాజమౌళిపై ప్రశంసల వర్షం

    By Rajababu
    |

    బాహుబలి చిత్రంతో దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. దేశ సినీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులు సృష్టించిన చిత్రాన్ని సినీ ప్రేక్షకులు అందించారు. వినోదరంగంలో అత్యధికంగా సంపాదనను సొంతం చేసుకొన్నందు వ్యక్తిగా ఫోర్బ్స్ మ్యాగజైన్ పరిగణించింది. తాజాగా ప్రకటించిన 100 మంది జాబితాలో రాజమౌళికి 15వ స్థానం దక్కింది. ఈ సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఆయన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రముఖ దినపత్రికతో తమ ఆనందాన్ని పంచుకొన్నారు.

     కొవ్వూరులోనే రాజమౌళి

    కొవ్వూరులోనే రాజమౌళి

    రాజమౌళి విద్యాభ్యాసం 1973లో కొవ్వూరులో జరిగింది. కొవ్యూరులోనే పుట్టిన జక్కన బాల్యం అక్కడే గడిచింది. కొవ్వూరుకు చెందిన ఆయన సినీ రంగంలో అగ్ర దర్శకుడిగా గుర్తింపు పొందడంపై గోదావరి జిల్లా వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తమ అభిప్రాయాలను పంచుకొన్నారు.

    Recommended Video

    రాజమౌళి మల్టీస్టారర్ బడ్జెట్ తెలిస్తే షాకే..!
    కొవ్వూరు పేరు తెచ్చిన జక్కన్న

    కొవ్వూరు పేరు తెచ్చిన జక్కన్న

    దర్శక ధీరుడు రాజమౌళి కొవ్వూరుకే పేరు తెచ్చిన వ్యక్తి. సినిమా రంగంలో ఎంతో మంది దర్శకులు ఉన్నా.. తన ప్రతిభతో బాహుబలి లాంటి చిత్రాన్ని రూపొందించి రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

     ఫోర్బ్స్ జాబితాలో పేరు

    ఫోర్బ్స్ జాబితాలో పేరు

    జక్కన్నగా పేరు తెచ్చుకోవడం, మా ఊరు వాడు కావడం మాకు ఎంతో గర్వకారణం. నేటి యువతకు రాజమౌళి ఆదర్శంగా నిలుస్తాడు. ఫోర్బ్స్‌ మ్యాగ్‌జీన్‌ ప్రకటించిన 100మంది జాబితాలో ఆయన పేరు ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం అని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు పేర్కొంటున్నారు.

     జక్కన్న గొప్ప వ్యక్తిగా

    జక్కన్న గొప్ప వ్యక్తిగా

    వినోద రంగంలో అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా ఫోర్బ్స్ జాబితాలో రాజమౌళి పేరు ఉండటంపైపై కొవ్వూరు వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్ జాబితాలో ఆయన 15వ స్థానంలో నిలవడం కొవ్వూరుకే గర్వకారణం. మా ప్రాంతంలో పుట్టి పెరిగిన జక్కన్నకు పేరు ప్రఖ్యాతులు రావడం గొప్ప విషయమని కొవ్వూరు వాసులు తమ ఆనందాన్ని ఇటీవల మీడియాతో పంచుకొన్నారు.

    English summary
    SS Rajamouli name listed in Forbes Magazine 100 peoples wealth list. His name list at 15 place in Forbes Magazine list. In this occassion, People of Godavari districts felt happy and shares their happiness for the Rajamouli's feat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X