twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడా... RRR హీరోయిజాన్ని 'గే' రిలేషన్షిప్ తో పొలుస్తున్నారా? దర్శకుడితో సహా..

    |

    ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరపైకి వచ్చిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ద్వారా అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే RRR సినిమా రీసెంట్ గా ఓటీటీ విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతో ఇష్టంగా చూశారు. ఇక చూసిన తర్వాత చాలామంది పాజిటివ్ రివ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే ఓ వర్గం మాత్రం సినిమాపై గే తరహా స్టోరీ అని కామెంట్స్ చేస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక తెలుగు దర్శకుడు కూడా ఈ కామెంట్స్ పై స్పందించిన విధానం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    కల్పిత కథ ఆధారంగా..

    కల్పిత కథ ఆధారంగా..

    దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత అంతకుమించి అనేల మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకు రావాలి అని అనుకున్నాడు. అందుకోసం మొదటిసారి అగ్రహీరోలు రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి RRR అనే ఒక మల్టీస్టారర్ ను తెరపైకి తీసుకు వచ్చాడు. ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ ఆధారంగా చేసుకొని ఒక కల్పిత కథను చూపించనున్నట్లు ముందుగానే చెప్పారు.

    రాజమౌళి తెలివితో..

    రాజమౌళి తెలివితో..

    దర్శకుడు రాజమౌళి తెలివిగా ముందుగానే ఎలాంటి వివాదాలు సినిమాకు అడ్డు పడకూడదనే ఫ్రీడమ్ ఫైటర్స్ మొత్తం పేర్లను కూడా సినిమాలో హైలెట్ చేయలేదు. భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, A రామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేసిన విషయం తెలిసిందే. సెన్సార్ ఇబ్బందులు తలెత్తకుండా దర్శకుడు తీసుకున్న ఆ జాగ్రత్తలపై పెద్దగా ఎవరూ ఫోకస్ చేయలేదు. నిజంగానే ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రలను హైలెట్ చేసినట్లుగా అందరూ అనుకున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా..

    ప్రపంచవ్యాప్తంగా..

    ఇక RRR సినిమా ఇండియాలోనే అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 1200 కోట్ల వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను సాధించింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా అన్ని భాషల్లో ఓటీటీల్లో కూడా విడుదల అయిపోయింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో హిందీలో విడుదలవ్వగా విదేశీయుల నుంచి కూడా భారీ స్థాయిలో స్పందన లభించడం విశేషం.

     గే రిలేషన్షిప్ అంటూ..

    గే రిలేషన్షిప్ అంటూ..

    దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీయులు కూడా ఈ సినిమా మా పై పాజిటివ్గా స్పందిస్తున్నారు. అయితే వెస్ట్రన్ కంట్రీస్ చెందిన కొంతమంది మాత్రం విభిన్నమైన తరహాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఇది ఒక విభిన్నమైన గే రిలేషన్షిప్ మూవీ అంటూ కామెంట్స్ చేస్తుండటం మిగతా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

    ఫ్యాన్స్ పవర్ఫుల్ కౌంటర్స్

    ఫ్యాన్స్ పవర్ఫుల్ కౌంటర్స్

    ఒక సినిమాను సినిమా తరహాలో చూడకుండా అనవసరంగా సంబంధం లేని వాదనలను క్రియేట్ చేస్తున్నారని విదేశీయులపై ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వారు స్వలింగ సంపర్కులు కాబట్టే అలాంటి ఆలోచనలు గుర్తుకు వస్తున్నాయి అని పవర్ఫుల్ కౌంటర్ కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

    RGV రియాక్షన్

    RGV రియాక్షన్

    ఇక విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఈ సినిమా పై వస్తున్న కామెంట్స్ కు అదే తరహాలో స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను చెప్పింది నిజమే "వారు చాలా స్వలింగ సంపర్కులు' పాశ్చాత్య ప్రేక్షకులు 'RRR'ని స్వలింగ సంపర్కుల కథగా భావించారు. అని రాంగోపాల్ వర్మ కూడా విభిన్నమైన తరహాలో స్పందించడంతో అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

    English summary
    western audience Shocking reaction on RRR movie and RGV reaction
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X