ఎన్టీఆర్ 'దమ్ము' టాక్ ఏంటి?
ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ దమ్ము ఈ రోజు 1230 స్క్రీన్స్ తో భారీగా ప్రపంచమంతటా విడుదలైంది. భారీ ఎక్సపెక్టేషన్స్ మధ్యన విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఇప్పటికే అబ్రాడ్ లో పడ్డాయి. అంతేగాక బెనిఫిట్ షోలు ఇక్కడ ఆంధ్రాలో పలుచోట్ల ఉదయమే ప్రారంభమయ్యాయి. అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం వారిని చాలా ఆనందపరిచిందని టాక్. ఊసరవెల్లితో డీలాపడ్డ ఎన్టీఆర్ మళ్లీ సింహలా విజృంబించాడని అన్ని చోట్ల నుంచి పాజిటివ్ గా వినపడుతోంది. ఈ టాక్ ఇలాగే కంటిన్యూ అయితే సినిమా చాలా పెద్ద రేంజికి వెళ్తుందని అంటున్నారు. అయితే ప్రిమియర్ షోకి ఎక్కువగా అబిమానులు ఉంటారనేది సత్యం. అలాగే పాటలు ఆడియోకన్నా తెరపైన చూస్తుంటే ఇంకా బాగా కిక్ ఇస్తుందని చెప్పటం ఈ సినిమకు సంభందించిన మరో పాజిటివ్ అంశం.
ఇక ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్ హైలెట్ గా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే సెకండాఫ్ ఫుల్ డ్రామా, సెంటిమెంట్ తో నింపినా ఫస్టాఫ్ మొత్తం లైటర్ వీన్ కామిడీతో నింపటం కలిసి వచ్చిందని టాక్. అలాగే చిత్రంలోని రూలర్, రాజా వాసిరెడ్డి పాటలకు అయితే జనం కంటిన్యూగా విజిల్స్ వేస్తూనే ఉన్నారు. టోటల్ గా ఈ చిత్రం క్లిక్ అయ్యిందని, రిలీజ్ కు ముందు వచ్చిన అంచనాలను రీచ్ అయ్యిందని చెప్తున్నారు. అయితే మాస్ కు ఏ రేంజిలో ఈ సినిమా పడుతుందనే దానిపైనే హిట్ రేంజి ఆధారపడుతుందని చెప్తున్నారు. డైలాగులు చెపుతూ, ఎమోషనల్ గా చేసే క్లైమాక్స్ ఫైట్ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే సినిమాకు హింస ఎక్కువ అవటం కొద్దిగా ఫ్యామీలలను దూరం చేసే అంశం అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే... విజయధ్వజ శ్రీసింహ (ఎన్టీఆర్) పట్టణంలో పెరిగిన కుర్రాడు. అందరూ బాగుండాలి.. ఆ అందరిలో నేనుండాలి అనుకునే మనస్తత్వం ఉన్నవాడు. సత్య (త్రిష)ని ప్రేమిస్తుంటాడు. ఇతనికి ఊళ్లో నీలవేణి (కార్తీక) అనే మరదలు ఉంటుంది. ఎలాంటి చిక్కునైనా నేర్పుగా పరిష్కరించే అతనికో సమస్య ఎదురవుతుంది. అందుకోసం పట్నం నుంచి ఊరికి బయలుదేరతాడు. తరవాత ఏమైందనేది అసలు కథ.
హైదరాబాద్ లోని మాగ్జిమం ధియోటర్స్ లో రిజర్వేషన్, ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది సేపట్లోనే మొత్తం బుక్ అయిపోయాయి. ఇక రేపటి రోజున స్టేట్ వైడ్ గా ఎనిమిది వందల షోలు పడనున్నాయి. అలాగే బెనిఫిట్ షోలు కూడా ఓ రేంజిలో హైదరాబాద్ లో పడుతున్నాయి. ఇక దమ్ము ఎనిమిది కోట్లు షేర్ సాధిస్తుందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. టాక్ ఎలా ఉన్నా మొదటి రోజు ఈ కలెక్షన్స్ మాత్రం లోటు ఉండదని వారు చెప్తున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్, సినిమాకు వచ్చిన హైప్ పై మొదటి రోజు కలెక్షన్స్ లెక్కేస్తారు. ఇక దమ్ము చిత్రం ఇప్పటికే అంతటా మ్యాజిక్ లా పాజిటివ్ టాక్ తో మారు మ్రోగిపోతోంది. ఇందులోని పాటలు ఇప్పటికే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











