ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ కష్టమేనా?
ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రారంభం కావాల్సిన చిత్రం లేటయ్యేటట్లు ఉందని సమాచారం. ఎందుకంటే ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ త్వరలో మొదలవనుందని, ఆ స్క్రిప్టు విపరీతంగా నచ్చిన ఎన్టీఆర్..ఆ సినిమా చేయటానికే డేట్స్ కేటాయిస్తున్నట్లు చెప్తున్నారు. దాంతో డైలమోలో పడ్డ బోయపాటి..తన స్క్రిప్టుని వెంకటేష్ కి వినిపించటానికి రెడీ అవుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇక సురేంద్రరెడ్డి కూడా కిక్ చిత్రం వచ్చి సంవత్సరం పైగా అయ్యింది కాబట్టి త్వరగా కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్ళాలని భావిస్తున్నారు. ఆయన రానా, రామ్ తో అనుకున్న ఊసరివిల్లి ప్రాజెక్టు వివిధ కారణాలతో ముందుకు వెళ్ళలేదు. ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి ల కాంబినేషన్ చిత్రాన్ని బి.వి.యన్. ప్రసాద్ నిర్మించనున్నారు. ఇక ఎన్టీఆర్ బృందావనం చిత్రం అక్టోబర్ 14 న రిలీజ్ అవనుంది.
జూ ఎన్టీఆర్ సురేంద్ర రెడ్డి అశోక్ అతనొక్కడే పూరీ జగన్నాధ్ jr ntr surendra reddy athanokkade athidi puri jagannath kick


Click it and Unblock the Notifications