Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నారా రోహిత్ 'సోలో' టాక్ ఏంటి?
పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయ్యే నారా రోహిత్ తాజా చిత్రం సోలో ఈ రోజు విడుదల అవుతోంది. రిలీజ్ కు మందు పెద్ద హైప్ క్రియేట్ చేయలేకపోయిన ఈ చిత్రం కుటుంబవర్గాలకు పట్టే అవకాశముందని వినపిసిస్తోంది. పూరీ జగన్నాధ్ బొమ్మరిల్లు సినిమాని డైరక్ట్ చేస్తే ఎలా ఉంటుందో సోలో చిత్రం అలా భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు. సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ కలగలపిన ఈ చిత్రం హీరో క్యారక్టరైజేషన్ ప్రధానంగా నడుస్తుంది. అనాధ అయిన హీరోకి తన ప్రేమించిన అమ్మాయి తండ్రి ఓ పెద్ద కుటుంబంలో నేను పిల్లను ఇస్తాను అంటే అతను ఎలా రియాక్టయ్యాడు.. ఏం చేసాడు అనేది ప్రధానంగా నడుస్తుంది. ప్రి క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు సినిమాకు ప్రాణమై నిలుస్తుంది. నారా రోహిత్ కూడా మెచ్యూరిటీ తో కూడిన ఫెరఫార్మెన్స్ చేసాడని చెప్తున్నారు. అలాగే దర్శకుడు పరుశరామ్ కూడా తన ఆంజనేయులు చిత్రం ఫెయిల్యూర్ కావటంతో ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుని చేసాడు.
ఇక నారా రోహిత్ కు కూడా ఈ చిత్రం కీలకమే. బాణం చిత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందినా అన్ని వర్గాలను చేరలేకపోయింది. దాంతో ఈ చిత్రం తనని ఫ్యామిలీలకు, యూత్ కి దగ్గర చేస్తుందని భావిస్తున్నాడు. పూరీ మార్క్ డైలాగులు, దిల్ రాజు సినిమాల్లో ఉండే ఫ్యామిలీ డ్రామా సినిమాకి హైలెట్ అయ్యి నిలబెడుతుందని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగులుకి మంచి పేరు వచ్చింది. నా ప్రేమ కథకి నేనే విలన్ ని, 'పోయేటప్పుడు నా చుట్టు నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది కానీ... పుట్టినప్పుడు నా చుట్టు నలుగురు లేకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది"అంటూ ప్రకాష్ రాజ్ తో ఓ డైలాగు హైలెట్ గా వినిపిస్తోంది. చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, సాయాజీషిండే, అలీ, ఎమ్మెస్‌నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారుల. సంగీతం: మణిశర్మ.ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, స్టైలింగ్: అర్చన పరశురామ్. అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య, నిర్మాణం: ఎస్వీకే సినిమా.