»   » బికినీ వేయొద్దని చెప్పారండీ.... నాగ చైతన్య గారూ: ఎవరికి చెప్పాడంటే

బికినీ వేయొద్దని చెప్పారండీ.... నాగ చైతన్య గారూ: ఎవరికి చెప్పాడంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు అవకాశాలు రాకపోతే... ఎక్స్‌పోజింగ్‌, బికినీ, లిప్‌లాప్‌లకు సిద్ధమైపోతుంటారు. దేశవ్యాప్తంగా టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న హీరోయిన్లలో ఎక్కువ శాతం ఈ కోవకు చెందినవాళ్లే. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మరో స్టార్ హీరోయిన్ సైతం బికినీకి సై అందట. అయితే, ఇంతలో నాగ చైతన్య కలగజేసుకొని బికినీ వేస్తే కెరీర్‌కు అడ్డంకులు వస్తాయని చెప్పడంతో ఆ హీరోయిన్ తన నిర్ణయాన్ని మార్చుకుందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు 'సాహసం శ్వాసగా సాగిపో' హీరోయిన్ మంజిమా మోహన్.

వర్ధమాన నటి మంజిమా మోహన్ మాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీవైపు ఆసక్తి చూపుతుంది. సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్యకు జంటగా నటించిన మంజిమా మోహన్ ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీతో అప్పుడే బికిని లుక్స్ వేయించటానికికి కొంత మంది దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ టాప్ హీరో మూవీలో మంజిమా మోహన్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇందులో ఈ బ్యూటీ హాట్ హాట్ గా కనిపించనుందని అంటున్నారు. అంతే కాకుండా బికిని లుక్స్ లో కనిపించేందుకు తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అయితే మంజిమా మోహన్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవటంతో నాగచైతన్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. జరిగిన వివరాలను తెలుసుకున్న తరువాత తనకు కరెక్ట్ గైడ్ లైన్స్ ని ఇవ్వటం జరిగిందట. దీంతో మంజిమా మోహన్ వెంటనే చేసుకున్న బికిని లుక్స్ ఒప్పందాన్ని రద్దుచేసుకుందని అంటున్నారు.

 Manjima Mohan

ఈ సినిమాలో నటనతో తెలుగు దర్శకనిర్మాతలను ఆకర్షించింది మంజిమా. ఈమెతో బికినీ వేయించి ఆమె అందాన్ని పూర్తిగా క్యాష్ చేసుకోవాలని కొందరు దర్శకులు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, దీనికి సంబంధించి ఈ హీరోయిన్‌తో చర్చలు కూడా జరిపినట్లు, దీనికి ఈ భామ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయితే, ఇంతలో ఈ విషయం తెలుసుకొని షాక్ తిన్న చైతూ..

గైడెన్స్ సరిగా లేదని, కెరీర్‌ను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి సలహాలు ఇస్తున్నారని చెప్పడంతో మంజిమా ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసిందట. మొత్తంగా మంజిమా మోహన్ చివరి నిముషంలో నాగచైతన్య ద్వార తెలుసుకొని, పెద్ద ప్రమాధం నుండి బయటపడ్డానని చెబుతోందట... ఏమయ్యా నాగచైతన్యా... అభిమానుల మనోభావాలతో ఆడుకుంటావా..??

English summary
Manjima Mohan of Sahasam Swasaga Sagipo fame, whose career is on the upswing, got ready for bikini show, hero Naga Chaitanya reportedly discouraged her. Seeing reason in what he said, Manjima backed off.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu