నయన మళ్లీ ప్రేమలో పడిందా? అతడితో అంత చనువేంటి?
చెన్నై: ఎవరైనా ఇద్దరు సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేసుల్లో కానీ, ప్రైవేట్ ఫంక్షన్లలో కానీ చాలా చనువుగా మెదిలితే వారిపై రకరకాల ప్రచారాలు జరుగడం చూస్తునే ఉన్నాం. సెలబ్రిటీల పట్ల సమాన్య జనానికి ఉన్న ఒక రకమైన ఇంట్రస్టే ఇలాంటి పరిస్థితులకు కారణం. ముఖ్యంగా సినీ తారల విషయంలో వెలువడే గాసిప్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.
తాజాగా నయనతార, తమిళ హీరో ఆర్య మధ్య సరికొత్త వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం దృష్ట్యా సినిమా షూటింగుల్లోనే కాకుండా ఇతర ప్రదేశాల్లోనూ చాలా చనువుగా మెదులుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న బంధం మామూలు బంధమా? లేక ఇంకేమైనా 'సం'బంధమా? అనే గాసిప్స్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.
వీరి మధ్య ఇలాంటి వార్తలు వెలువడటానికి కారణం.... ఇద్దరూ అవివాహితులు కావడం, ఇద్దరూ ప్రస్తుతం సింగిల్ గా ఉండటమే. ఇటీవల ఆర్య ఇంట్లో ఓ వేడుక జరిగితే నయనతారను స్పెషల్‌గా ఇన్వైట్ చేసాడు ఆర్య. ఇలాంటి పరిణామాలు తరచూ చోటు చేసుకుంటుండటంతో ఇద్దరి మధ్య స్నేహ బంధం కాస్తా ఇంకేమైనా బంధంగా ముదురుతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆర్య, నయనతార తమిళ చిత్రాలైన వాలై, రాజా రాణి చిత్రంలో కలిసి నటిస్తున్నారు.

ఇటీవల ఆర్య నయనతార నటిస్తున్న సెట్స్ కు వచ్చి ఆమెతో చాలా సేపు గడిపాడట.

అంతటితో ఆగకుండా చాలా మంది దర్శక నిర్మాతలకు నయనతారను తీసుకోవాల్సిందిగా రికమండ్ చేస్తున్నాడట ఆర్య.

గతంలో ఈ ఇద్దరు కలిసి బాస్ ఎంగిర భాస్కరన్ అనే చిత్రంలో కలిసి నటించారు. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడింది.

అయితే నయనతారతో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆర్య ఖండిస్తున్నారు.


Click it and Unblock the Notifications











