స్పైసీ సంఘటన గురించి...ప్రియమణి
సాధ్యం ప్రమోషన్ తర్వాత ప్రియమణి ఎక్కడా తెలుగులో కనపడలేదు. అయితే మీడియాకు దూరంగా వెళ్ళి ప్రియమణి ఏం చేస్తోంది అన్నది అందరికీ ఆసక్తిగా మారింది. దానికామె సమాధానంగా నేను ప్రస్తుతం మణిరత్నం రావణ్ తెలుగు వెర్షన్ కి డబ్బింగ్ చెప్తున్నాను. అలాగే గోపీచంద్ తో చేసిన గోలీమార్ చిత్రానికి కూడా అదే పని చేస్తున్నాను. ఇక రక్త చరిత్ర షెడ్యూల్స్ ఉన్నప్పుడు అటెండవుతున్నాను. అలాగే కన్నడ చిత్రం ఎనో ఒంటర లో సోలో సాంగ్ సీక్వెన్స్ చేస్తున్నాను. వీటికి తోడు తర్వాత నేను చేయబోయే స్క్రిప్టులను చదువుకుని, ఆ పాత్రలను ఆకలింపుచేసుకుంటున్నాను. ఇవన్నీ కాదు రీసెంట్ గా మీ జీవితంలో చోటు చేసుకున్న స్పైసీ విషయాల గురించి చెప్పండి అంటే..అలాగే తప్పని సరిగా... ఈ మధ్యన నేను కొన్ని స్పైసీ డిషెష్ వండాను. ఈ సారి వండినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను అంది నవ్వుతూ...అదీ సంగతి.
ప్రియమణి రావణ్ మణిరత్నం రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర గోలీమార్ గోపీచంద్ సాధ్యం priyamani pravarakyudu jagapathi babu raktha charitra gopichand puri jagannath


Click it and Unblock the Notifications