శ్రియకు పిల్లలంటే మక్కువ!!
వాట్స్ కుకింగ్ స్టెల్లా .....శ్రియ నటించిన ఇండో కెనడియన్ ఫిల్మ్. ఇందులో శ్రియ ఒక్కటిన్నర సంవత్సర పాప అలనా, పాలనా చూసుకునే అమ్మాయిగా నటించారు. షూటింగ్లో భాగంగా ఈ చిన్నారితో శ్రియ ఎక్కువ సేపు గడిపారట. అలా చిన్న పాపతో టైమ్ స్పెండ్ చేయడం సరికొత్త అనుభూతినిచ్చిందని శ్రియా చెబుతూ 'సహజంగానే నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ముద్దులొలికే వారి మోము చూస్తుంటే ఎక్కడలేని ప్రేమా పుట్టికొస్తుంది. కల్మషం ఎరుగని చిన్నారులను చూస్తున్నప్పుడు భగవంతుడికి ప్రతిరూపాలేమో అనిపిస్తుంటుంది. అందుకే, నా చుట్టూ ఉండే చిన్నపిల్లలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాను. నాకో మేనల్లుడు ఉన్నాడు. వాడికి రెండేళ్లు. ముద్దు ముద్దుగా ఉంటాడు.వచ్చీరాని మాటలు మాట్లాడుతుంటే నేను విని చాలా ఎంజాయ్ చేస్తాను.
షూటింగ్స్ లో భాగంగా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు బాగా గుర్తొస్తాడు. కానీ, నాకే మాత్రం తీరిక చిక్కినా వాడిని బయటికి తీసుకెళ్తాను. బొమ్మలు కొనిపెడతాను అంటున్నారు శ్రియ. ఆమె ఈ మాటలు చెబుతున్నప్పుడు మేనల్లుడి పట్ల శ్రియకున్న ప్రేమంతా ఆమె కళ్ళల్లో మెరుపు రూపంలో కనిపించింది.


Click it and Unblock the Notifications











