twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే మార్చింది?: ప్రభాస్ కెరీర్ సీక్రెట్ ఇదే.., అలాంటివాన్ని ఇలా!

    |

    ఛత్రపతి, మిర్చి లాంటి హిట్ సినిమాలు టాలీవుడ్‌లో ప్రభాస్ కంటూ ఓ స్థానాన్ని ఏర్పరచగా.. బాహుబలి సినిమా ప్రభాస్‌ను మిగతా హీరోల కన్నా ఇంకాస్త ముందుకు తీసుకెళ్లింది. కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమవకుండా పక్క ఇండస్ట్రీల్లోనూ తన మార్కెట్ విస్తరించుకునేందుకు బాహుబలి దోహదపడింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న 'సాహో' కూడా హిందీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. హీరోగా ఇంత ఎదిగిన ప్రభాస్ కెరీర్ సీక్రెట్ ఏంటో తెలుసా?..

    సాహోకు ఊహించని షాక్?: చివరి నిమిషంలో!.., చేసేది లేక ఇప్పుడిలా..సాహోకు ఊహించని షాక్?: చివరి నిమిషంలో!.., చేసేది లేక ఇప్పుడిలా..

     ప్రభాస్‌కు సిగ్గు ఎక్కువ:

    ప్రభాస్‌కు సిగ్గు ఎక్కువ:

    నిజానికి ప్రభాస్‌కు నలుగురిలో మాట్లాడాలంటే బిడియం ఎక్కువ. సినిమా షూటింగ్స్ లోనూ గొంతు తగ్గించి డైలాగ్స్ చెప్పేవాడట. ఆ తర్వాత డబ్బింగ్ సమయంలో మళ్లీ డైలాగ్ కు తగ్గట్లు గొంతు అడ్జస్ట్ చేసేవాడట.

     'బాహుబలి'తో జయించాడు..:

    'బాహుబలి'తో జయించాడు..:

    బాహుబలి ముందు వరకు షూటింగ్ స్పాట్‌లో గట్టిగా డైలాగ్ చెప్పడానికే ఇబ్బందిపడ్డ ప్రభాస్.. ఈ సినిమాతో దాన్ని కూడా అధిగమించేశాడు. చుట్టూ వందల మంది ఉన్నా ఏమాత్రం తొణకకుండా.. బెణకకుండా డైలాగ్ చెప్పేసేవాడు. అంతలా అతను స్ఫూర్తి పొందడానికి కారణం పరోక్షంగా ఆయన పెద్దనాన్న కృష్ణంరాజే.

     అదే మార్చింది..:

    అదే మార్చింది..:

    సినిమాల్లోకి వచ్చాక కూడా సిగ్గు, బిడియం వదలని ప్రభాస్.. అంతకుముందు ఇంకెంత బిడియంతో ఉండేవాడో!. అంతటి సిగ్గరి అయిన ప్రభాస్‍‌ను ఒకే ఒక్క సినిమా బాగా ప్రభావితం చేసిందట. ఆ సినిమా ప్రభావం వల్లే సినిమాల్లోకి రావాలని ప్రభాస్ గట్టిగా ఫిక్స్ అయ్యాడట.

     ఏంటా సినిమా?:

    ఏంటా సినిమా?:

    ప్రభాస్‌ పెదనాన్న నటించిన 'భక్త కన్నప్ప' ఆయన్ను చాలా ప్రభావితం చేసిందట. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శివ భక్తుడి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా 1976లో విడుదలైంది. ఆ సినిమా చూశాకే నటుడు కావాలని ప్రభాస్‌ ప్రేరణ పొందారట.

    మార్కెట్ విస్తరించుకునే పనిలో..:

    మార్కెట్ విస్తరించుకునే పనిలో..:

    రాజమౌళి చేతిలో పడ్డాక ప్రభాస్ దశా దిశ పూర్తిగా మారిపోయాయి. బాహుబలి ఆయనకు ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. పక్క ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడు ప్రభాస్ అంటే గుర్తుపడుతుండటంతో అక్కడ కూడా తన మార్కెట్ విస్తరించుకునే పనిలో పడ్డాడు ప్రభాస్.

     సాహోలో 'శ్రద్దా' అందుకే..:

    సాహోలో 'శ్రద్దా' అందుకే..:

    సాహోలో శ్రద్దాకపూర్‌ను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం హిందీ మార్కెట్‌పై ఫోకస్ చేయడమేనని చెప్పవచ్చు. శ్రద్దా ఇమేజ్ బాలీవుడ్ మార్కెట్‌కు కలిసొస్తుందన్న ఉద్దేశంతోనే సినిమాలో ఆమెను తీసుకున్నారన్న ప్రచారం ఉంది.

     'శ్రద్దా'ది కీలక పాత్ర:

    'శ్రద్దా'ది కీలక పాత్ర:

    బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ చేశారు కాబట్టే శ్రద్దాకపూర్ ను తీసుకున్న నిర్మాతలు.. సినిమాలో ఆమె పాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. రొటీన్ తెలుగు సినిమాల్లో లాగా కాకుండా బాలీవుడ్ సినిమాల్లో ఉన్నట్లే హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఆమెపై అద్భుతమైన సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయని నిర్మాతలు చెబుతున్నారు.

    English summary
    Prabhas Raju Uppalapati, aka Prabhas, might very well be the shiest and sweetest guy from your batch who went on to become a superstar a few years after graduating from college.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X