అతడిని అసిన్ ఏం చేసింది?

అసిన్ వద్ద నాలుగేళ్లు పనిచేసిన ముత్తుకుమార్ అనే వ్యక్తి అదృశ్యం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. తన కుమారుడి అదృశ్యం వెనుక అసిన్ హస్తం ఉందని ఆరోపిస్తూ..ముత్తుకుమార్ తల్లి వైదు పోలీసులకు ఫిర్యాదు చేయడం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. అసిన్‌కు సంబంధించిన అనేక రహస్యాలు తన కుమారుడికి తెలిసి ఉండడం వల్ల, అసిన్ కుటుంబ సభ్యులే అతడ్ని బంధించి ఉండవచ్చని ముత్తుకుమార్ తల్లి ఆరోపిస్తోంది. అయితే అసిన్ మాత్రం ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేస్తోంది.


Click it and Unblock the Notifications











