అల్లు అర్జున్ కి బ్రెయిన్ వాష్ ఎందుకు?
అల్లు అర్జున్ తలకి ఓ చుట్టూ వైర్లు, తలకు బ్రెయిన్ వాషింగ్ మెషిన్ కనెక్ట్ అయిన ఉన్న ఫోటో అంతటా సెన్సేషన్ గా మారింది. అల్లు శిరీష్ ..తన ట్విట్టర్ ఎకౌంట్ లో ఈ లేటెస్ట్ ఫోటోను ఉంచారు. ఆ ఫోటోను అంతా వింతగా మాట్లాడకుంటున్నారు. ఇంతకీ ఆ ఫోటో సెవన్ అప్ యాడ్ కి సంభందించింది. ఈ యాడ్ త్వరలో టీవిల్లో ప్రసారం కానుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో బన్నీ నటించిన వరుడు చిత్రం భాక్సా ఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని చవిచూసింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న వేదం చిత్రంలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. అలాగే వివి వినాయిక్ దర్శకత్వంలో ప్రారంభం కానున్న బద్రీనాధ్ చిత్రం షూటింగ్ కు ప్రిపేర్ అవుతున్నారు.
అల్లు అర్జున్ వరుడు గుణశేఖర్ భానుశ్రీ మెహ్రా బద్రీనాధ్ వేదం allu arjun varudu gunasekhar bhanusri mehra twitter badrinadth


Click it and Unblock the Notifications