Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిఖిల్ గురించి రాజమౌళి ,నిఖిల్ రిప్లై
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి తను షూటింగ్ లో ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా..చుట్టు ప్రక్కల ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాటిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూంటారు. రీసెంట్ గా ఆయన నాని తాజా చిత్రం ఎవడే సుబ్రమణ్యం ట్రైలర్ ని, నిఖిల్ ..సూర్య వెర్శస్ సూర్య ఫస్ట్ లుక్ టీజర్ ని పొగడ్తల్లో ముంచెత్తారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రాజమౌళి ట్వీట్ చేస్తూ"నిఖిల్ ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన సబ్జెక్టులు ఎంచుకుంటూ తనదైన స్పేస్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆల్ ది బెస్ట్ ", అని ట్వీట్ చేసారు. ఆ కాంప్లిమెంట్ కు నిఖిల్ చాలా ఆనందపడ్డారు. మీ అంచనాలకు తగినట్లుగా మేం కష్టపడతాం అంటూ ఈ విషయంనిఖిల్ రిప్లై గా ట్వీట్ చేసారు.

ఇక ‘స్వామి రా రా', ‘కార్తికేయ' అంటూ విభిన్న చిత్రాలతో ముందుకు వెళ్తున్న నిఖిల్ మరో విభిన్న కాన్సెప్టు తో ముందుకు వస్తున్న చిత్రం సూర్య vs సూర్య'. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను న్యూ ఇయర్ గిఫ్ట్ గా విడుదల చేసారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
నిఖిల్ మాట్లాడుతూ... "సూర్య అస్తమయం ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి 2014 చివరి సన్ సెట్ కి మించిన మంచి సమయం లేదు' అని ట్వీట్ చేసాడు. అందుకు తగినట్లే పోస్టర్స్ కూడా విభిన్నంగా ఉన్నాయి.

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
‘హ్యాపీ డేస్' తర్వాత మరోసారి నిఖిల్ కాలేజ్ నేపధ్యంలో చేస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సూర్య vs సూర్య'. ఈ సినిమాతో ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘కార్తికేయ' సినిమాల సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. తనికెళ్ళ భరణి, సత్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.