నిత్యానంద స్టోరీలో నచ్చింది అదే...రామ్ గోపాల్ వర్మ
సెక్స్ స్కామ్ లో ఇరుక్కున్న స్వామి నిత్యానందపై రామ్ గోపాల్ వర్మ గాడ్ అండ్ సెక్స అనే చిత్రం చేద్దామనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఆ ఐడియా ఎలా వచ్చిందో, ఆ స్టోరీలో ఏమి నచ్చిందో ఓ ఇంటర్వూలో చెప్పారు. నాకు నిత్యానంద కథలో బాగా నచ్చింది సెక్స్ విషయం కాదు. నిత్యానంద..కన్నడ చిత్రం పాటలు ఎంజాయ్ చేయటం. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అతను ఓ నార్మల్ మనిషేనని అర్ధం అయింది. అతని ప్రేవేట్ లైఫ్ లో డోర్స్ వెనకాల అతను ఓ నార్మల్ మనిషే అని అర్దమైంది. అదే నన్ను ఈ చిత్రం చేయటానికి ప్రేరేపించింది. అదే నేను ఈ చిత్రంలో చూపించబోతున్నాను అన్నారు. ప్రజలందరు చేత గాడ్స్ మెన్ గా గుర్తింపుతెచ్చుకుని మన్ననలు అందుకుంటున్న ఈ బాబాలంతా చాలా నార్మల్ మనుష్యులు అని చూపించబోతున్నాను. అలాగే ఆశ్రమాల్లో జరిగే పవర్ పాలటిక్స్, అక్కడ సైలెంట్ జరుగుతున్న ఓ పరిశ్రమను నేను బయిటపెట్టబోతున్నాను అన్నారు. అయినా బాబా లు కోట్ల రూపాయలు ఆశ్రమాలు పేరు చెప్పి సంపాదిస్తున్నారు. దాని గురించి ఎవరికీ భాదలేదు. ఆయన సెక్స్ చేస్తేనే తప్పు వచ్చింది అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. అలాగే దేముడు మీద కూడా విజయం సాధించగలిగే వీరు సెక్స్ ని జయించలేకపోతున్నారనేది ఇక్కడ గమనించాల్సిన విషయం అన్నారు.


Click it and Unblock the Notifications











