బధ్రీనాథ్ టార్గెట్ 'శక్తి' కాదు 'మగధీర’యే...!
ఇటీవల విడుదల చేసిన 'బద్రినాథ్" స్టిల్స్ లో అల్లు అర్జున్ కత్తి పట్టుకొని యోధుడిగా విన్యాసాలు చేస్తుండటం చూస్తే ఏమనిపిస్తుంది?తొలిసారిగా ఓ యోధుడి గెటప్ లో ఉన్న బన్నీని చూసి ఆయన తండ్రి అరవింద్ మాత్రం మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు ఏ చిత్ర పబ్లిసిటీలో చూపించని శ్రద్ద అరవింద్ ఈ చిత్రంపై చూపిస్తున్నాడు. సినిమా విడుదలకు ఇంకా నెలన్నర సమయం ఉన్నా..ఇప్పటి నుండే నగరం ప్రధాన సెంటర్స్ లో యోధుని గెటప్ తో ఉన్న అల్లు అర్జున్ హోర్డింగ్ లే ప్రత్యక్ష సాక్ష్యం.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో వివి వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గంగోత్రి, సమరసింహారెడ్డి, ఇంద్ర చిత్రాలకు కథను అందించిన చిన్నికృష్ణ కథను అందించాడు. కాగా ఎన్టీఆర్ 'శక్తి" చిత్ర కథకు..ఈ చిత్ర కథకు పోలికలు ఉన్నాయని ఇటీవల రూమర్ కూడా షికారు చేసింది. ఇక 'శక్తి" విడుదలై ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోవడంతో ఇప్పుడు అందరి దృష్టి 'బద్రినాథ్" పైనే ఉంది. అయితే బద్రినాథ్ టార్గెట్ ఏమిటి?ఏ చిత్ర రికార్డులను తిరగరాయలనే టార్గెట్ తో అర్జున్ ఈ చిత్రం చేశాడు?ఇదే అందరి మనసులో నెలకొని ఉన్న సందేహం. అయితే 'మగధీర"లో రామ్ చరణ్ ని కాలభైరవ గెటప్ లో చూసిన అర్జున్ తను కూడా అలాంటి చిత్రం చేయాలనే ఉద్దేశ్యంతోనే 'బద్రినాథ్"ను చేశాడు..అనే ఊహాగానాలు కూడా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











