What is Bronchoscopy? పవన్ కుమారుడికి బ్రాంకోస్కోపి చికిత్స.. సింగపూర్ స్కూల్లో ప్రమాదంలో చిన్నారి మృతి!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు సింగపూర్‌లో చదువుకొంటున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ గురించిన వివరాలు అందిస్తూ పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు.
పలువురు జనసేన నేతలు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్తించారు. ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి, ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తన కుమారుడి ప్రమాదం గురించి పవన్ కల్యాణ్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

పవన్‌కు ప్రధాని మోడీ ఫోన్
నా చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకొంటున్న సింగపూర్ స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్‌లో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని క్రమంగా కోలుకొంటున్నాడు. ప్రమాద వార్త తెలుసుకొని ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేసి పరామర్శించారు. మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి వాకబు చేసి ధైర్యం చెప్పారు. అవసరమైన సహకారం అందించాలని సింగపూర్ హై కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అని పవన్ కల్యాణ్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
చంద్రబాబు పరామర్శ
ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించి.. మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యకర్తలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి, ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ తెలిపారు.
చిన్నపాటి ప్రమాదం అనుకొన్నా.. కానీ
ఇక ఏపీలో మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సింగపూర్ స్కూల్‌లో జరిగిన ప్రమాదం చిన్నపాటిదే అనుకొన్నాను. ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదు. తీరా చూస్తే మా అబ్బాయికి బ్రాంకోస్కోపి (Bronchoscopy) చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యువాత పడటం చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు.
అకీరా పుట్టిన రోజునే ప్రమాదం
విశాఖలోని అరకు ప్రాంతంలో పర్యటనలో ఉన్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు. సింగపూర్‌కు బయలుదేరి వెళ్తున్నాను. ఈ రోజు మా పెద్దబ్బాయి అకీరా నందన్ పుట్టిన రోజు. అదే రోజున మా రెండో అబ్బాయికి ఇలా జరగడం దురదృష్టకరం. ముందుగా ప్లాన్ చేసుకొన్న ప్రకారమే పర్యటనలు, అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ క్లిష్టసమయంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు అని పవన్ కల్యాణ్ అన్నారు.
మార్క్ శంకర్‌కు బ్రాంకోస్కోపి ట్రీట్‌మెంట్
ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యలను తొలగించడానికి బ్రాంకోస్కోపీ చికిత్సను అందిస్తున్నారు. ముక్కు లేదా నోటి ద్వారా చిన్న ట్యూబ్‌ను ఊపిరితిత్తుల్లోకి పంపి కెమెరా ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఈ పరీక్షను సుమారు 45 నిమిషాల పాటు వైద్యులు నిర్వహిస్తారు.
రాజకీయ నేతలు, సినీ తారల పరామర్శ
ఇదిలా ఉండగా, పవన్‌కు ఫోన్ చేసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి , తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి, కేంద్ర మంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి రఘు రామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కే ఆచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, దుర్గేష్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర సినీ నటులు, సినిమా రంగ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మార్క్ శంకర్ కోలుకోవాలని ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











