twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా గందరగోళం: సినిమాలా? రాజకీయాలా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినిమాలా? రాజకీయాలా? ఎటు వైపు వెళ్లాలో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రచార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల అనంతరం సీమాంధ్రలో జీరో కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

    ప్రస్తుతం ఖాలీగా ఉన్న చిరంజీవి 150వ సినిమాకు సంసిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ......రాజకీయాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పదవి ఉన్నంత సేపు పార్టీకి దగ్గరగా ఉండి అధికారం పోయాక పార్టీకి అంటీ ముట్టనట్లు ఉంటే విమర్శలు వస్తాయనే కోణంలో ఆయన ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    అందుకే పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండకుండా....పార్టీ కార్యక్రమాలకు తచ్‌లో ఉంటూనే తన 150 వ సినిమాపై దృష్టి సారించాలని చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు అన్నయ్యను బీజేపీ వైపు లాంగేందుకు తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.

    చిరంజీవి 150 సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

    గీతా ఆర్ట్స్ చేతికి 150వ సినిమా..

    గీతా ఆర్ట్స్ చేతికి 150వ సినిమా..

    ఈ చిత్రాన్ని చిరంజీవి బావమరిదికి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట.

    చరణ్‌కు ఛాన్స్ లేనట్లేనా?

    చరణ్‌కు ఛాన్స్ లేనట్లేనా?

    రామ్ చరణ్‌కు అనుభవం లేదు నిర్మాతగా రామ్ చరణ్‌కు అనుభవం లేదు. ఈ నేపథ్యంలో అతని చేతికి నిర్మాణ బాధ్యతలు అప్పజెబితే అనవసర ఇబ్బందులు తలెత్తుతాయని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం.

    ఠాగూర్‌ ను మించేలా..

    ఠాగూర్‌ ను మించేలా..

    గతంలో చిరంజీవికి ఠాగూర్ లాంటి అద్భుతమైన సినిమాను అందించిన వివి వినాయక్ అందుకు ఏ మాత్రం తీసిపోకుండా చిరంజీవి 150వ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    అన్ని మాసాలాలు పడాల్సిందే...

    అన్ని మాసాలాలు పడాల్సిందే...

    చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

    పుట్టినరోజు కానుక

    పుట్టినరోజు కానుక

    ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా కానకగా అందనుందని మెగాఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

    English summary
    Says a source, “Now that the elections are over, Chiru is toying with the idea of taking his 150th film on to floors as soon as possible. He has been listening to scripts for a long time, finally zeroing in on the inspiring tale of ‘Uyyalawada Narasimha Reddy’. It is a role that befits his stature, both in the film and political arena. His son RamCharan is monitoring the activities surrounding the film which is currently in its pre-production.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X