ఇంతకీ పూరీ జగన్నాధ్ నెక్ట్స్ సినిమా ఏంటి?
ఏక్ నిరంజన్ రిలీజ్ కాగానే పూరీ నెక్ట్స్ సినిమా ఏంటనే సందేహం అందరిలో మొదలైంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు దాకా చేస్తానని ప్రకటించి ఉన్నాడు. అందులో మొదట గోపీచంద్ తో గోలీ మార్ చిత్రం. ఇందులో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టుగా కనిపించనున్నాడని చెప్పాడు. అనంతరం రవితేజ హీరోగా సినిమా చేయనున్నాడని చెప్పాడు. పవన్ కళ్యాణ్, గణేష్ బాబు కాంబినేషన్ లో నయనతార హీరోయిన్ గా చేస్తానని ప్రకటన చేసాడు. వీటికి తోడు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను రాజశేఖర్ హీరోగా చేస్తున్నానని ఓపినింగ్ చేసాడు. వీటికి తోడు అభిషేక్ బచ్చన్ తో ఏక్ నిరంజన్ చిత్రాన్ని చేస్తానన్నాడు. మరో ప్రక్క అక్షయ్ కుమార్ బంపర్ ఆఫర్ చిత్రాన్ని చేయమంటున్నాడని చెప్పాడు. దాంతో పూరీ తరువాత సినిమా ఏమిటి అన్నది కన్ఫూజన్ ఏర్పడింది. ఇంతకూ ఏ చిత్రం చేస్తాడంటారు.
పూరీ జగన్నాధ్ గోపీచంద్ గోలీమార్ పవన్ గణేష్ రాజశేఖర్ ఏక్ నిరంజన్ అబిషేక్ బంపర్ ఆఫర్ puri jagannath gopichand goli maar pawan kalyan ganesh rajashekar ek niranjan


Click it and Unblock the Notifications