అక్కినేని అమల కు ఉపాసనకి ఏంటి రిలేషన్....!?
రామ్ చరణ్ చేసుకోబోయే కామినేని ఉపాసనకి, నాగ్ క్యూట్ వైఫ్ అక్కినేని అమల తో మంచి పరిచయం ఉందని సమాచారం. బ్లూ క్రాస్ మెంబర్ అయిన ఉపాసనకి జంతువులంటే తగని ప్రేమ అని చరణ్ ఈ మద్య ఇంటర్వ్యూ లో ఎడాపెడా వాయించిన సంగతి తెలిసందే..ఇక అమల జంతు ప్రేమ గురించి తెలియని వారుండరు. బ్లూ క్రాస్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అమలదే అంటే ఆశ్చర్యం లేదు. అలాంటి అమలకి కూడా తన దగ్గర జంతువుల్ని ఉంచే చోటు లేకపోతే వెంటనే గుర్తొచ్చేది ఉపాసనేనట. ఈ సంగతి కూడా చరణే చెప్పాడనుకోండి...
అమలగారికి జంతువులంటే అపారమైన ప్రేమ అని వివరించాడు. ఉపాసన మీద ప్రేమతో చరణ్ కూడా జంతువుల మీద ఇష్టం పెంచుకున్నాడు. వివిధ పెంపుడు జంతువులతో చరణ్ తన ఇంటిని నింపేశాడు. ఉపాసన అంతటి సెన్సిటివ్ అమ్మాయి భార్యగా రావాలని ఏ మగాడు అయినా కోరుకుంటాడని, ఆమె తనకి అర్థాంగి కాబోతుండటం తన అదృష్టమని చరణ్ చెప్పాడు...
amala upasana kamineni ram charan teja chiranjeevi nagarjuna అమల ఉపాసనా కామినేని రామ్ చరణ్ తేజ్ చిరంజీవి నాగార్జున


Click it and Unblock the Notifications