Rajamouli Vs Allu Aravind: రాజమౌళి, అల్లు అరవింద్ మధ్య మగధీర గొడవేంటి? సింహాద్రి పెట్టిన మంట తెలుసా?
Rajamouli Vs Allu Aravind: దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ కీర్తిని సంపాదించుకున్నారు. అదే సమయంలో తెలుగు సినిమా స్థాయిని పాన్ వరల్డ్ వరకు తీసుకెళ్లిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతోంది. ఆయనతో ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతకు లాభాల పంటను పండిస్తారనే నమ్మకముంది. అలాంటి రాజమౌళికి , స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మధ్య కోల్డ్ వార్ జరిగిందనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగింది? వారి మధ్య సైలెంట్ వార్ కారణమేంటో? ఓ లూక్కేయండి.
వాస్తవానికి డైరెక్టర్ రాజమౌళికి , ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి మధ్య సన్నిహిత బంధాలుంటేవి. ఈ కారణంగానే వీరిద్దరి కలిసిలో రామ్ చరణ్ హీరోగా 'మగధీర'సినిమాని తెరకెక్కించారు. 2009, జులై 31న విడుదలైన మగధీర చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు ఇండస్ట్రీలోని పలు రికార్డులను బ్రేక్ చేసి.. కలలో కూడా ఊహించని రికార్డులను తిరగరాసింది మగధీర. అలాగే.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పాలి. కానీ, ఈ సినిమా విషయంలో డైరెక్టర్ రాజమౌళికి కోపం వచ్చేలా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ వ్యవహరించారట.

ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా వివరించారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఎన్నో సినిమాలు వంద రోజులు కూడా ఆడాయి. అయితే.. రికార్డుల కోసం సినిమాలను కొన్ని సెంటర్లల్లో బలవంతంగా ఆడించేవారంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు రాజమౌళి.
రాజమౌళి కెరీర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన 'సింహాద్రి' కూడా బాక్ట్ బస్టర్ అనే విషయం తెలిసిందే. సింహాద్రి సినిమా ఎన్నో థియేటర్స్ లో వంద రోజులు ఆడిందనీ, అది జెన్యూన్ గా రికార్డు అని తెలిపారు. ఆ విజయాన్ని తాము ఎంతో సంతోషాన్ని ఇచ్చిందనీ, చాలా ఎంజాయ్ చేశామన్నారు. కానీ, ఆ సినిమా నిర్మాతలు కావాలని, రికార్డుల కోసం 175 రోజులు ఆడించారనీ, అలాంటివి కొత్తేమీ కాదు.. చాలా సినిమాల విషయంలో జరిగాయన్నారు. కానీ అలాంటి విషయాలు తనకు నచ్చదని రాజమౌళి ఓపెన్ చేప్పేశారు.

ఈ విషయాన్ని మగధీర షూటింగ్ ప్రారంభంలోనే ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ తో కూడా మాట్లాడననీ, ఇలాంటివి మనకు వద్దు సార్ అని అల్లు అరవింద్ గారికి వివరించానని రాజమౌళి తెలిపారు. మగధీర విడుదలైన తరువాత ఎలాంటి ప్రభంజనం స్రుష్టించిందో అందరికి తెలిసిందే. ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న బ్రేక్ చేసి దానికి రెండింత రికార్డ్ క్రియేట్ చేసింది మగధీర. అలాంటిది.. రికార్డుల కోసం మగధీర మూవీని కొన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడించారు. ఈ విషయం తనకు నచ్చలేదని రాజమౌళి స్పష్టం చేశారు.
ఈ విషయంపై.. 'మగధీర పెద్ద హిట్. అన్ని విధాలు సక్సెస్ అయినా ఎందుకు సార్.. అలా చేశారు' అని అల్లు అరవింద్ గారిని తాను ప్రశ్నించనన్నారు. ఆ సమయంలో అల్లు అరవింద్ సమాధానమిస్తూ.. 'ఫ్యాన్స్ కోసం తప్పట్లేదుగా' అన్నట్టు సమాధానం ఇచ్చారట. ఆ విషయంలో తాను హర్ట్ అయ్యాననీ, మనది కానిది మనది అని చెప్పుకుని ఎలా ఆనందపడుతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాజమౌళి. మరీ రాజమౌళి అభిప్రాయం సరైనదేనా.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి.


Click it and Unblock the Notifications











