twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీమాంధ్రలో పోరు తెలంగాణ బ్లాక్, నారాయణమూర్తి ఫైర్

    By Bojja Kumar
    |

    తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రముఖ విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి రూపొందించిన సినిమా 'పోరు తెలంగాణ". సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదలైంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సినిమా కాబట్టి తెలంగాణ ప్రాంతంలో సాధారణంగానే మంచి టాక్ తో ముందుకు సాగుతోంది. అయితే ఈ సినిమా సీమాంద్రలో ఒక్కటంటే ఒక్క థియేటర్లో కూడా విడుదల కాలేదు. కారణం అక్కడ ఈ సినిమా విడుదల చేయడానికి థియేటర్లే దొరకలేదు. అయితే తన సినిమాను కావాలనే ఇక్కడ విడుదల కాకుండా కొందరు సీమాంధ్ర పెట్టుబడి దారులు అడ్డకుంటున్నారని, సినిమా రంగంలో రాజకీయాలేమిటి? అంటూ మండి పడుతున్నారు దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి.

    సోమవారం ఓ టీవీ ఛానల్ తో నారాయణ మూర్తి మాట్లాడుతూ....సినిమా నచ్చితే చూడాలి, నచ్చక పోతే చూడ్డం మానేయాలి, కానీ ఇలా సినిమాను అడ్డుకోవడం సంస్కారం కాదని అభిప్రాయ పడ్డారు. 69 ఉద్యమంలో దాదాపు 300 మంది మరణించారని, ఆ తర్వాత జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారని. ఈ నేపథ్యంలో అన్న అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి మనది-అందరం కలిసి ఉందా అనే కాన్నెప్టుతో తన సినిమాలో పాటను రాయించుకున్నారు. సిఃనారె రాసిన ఆ పాటను అన్ని ప్రాంతాల వారు ఆదరించారు. జై ఆంధ్ర ఉద్యమానిక సపోర్టు పలికిన హీరో కృష్ణ తన అభిప్రాయాన్ని సినిమా ద్వారా వెల్లడించారు. అప్పట్లో ఆ సినిమాలను అందరూ ఆదరించారు. వారి తరహాలోనే నేనూ ఓ కళాకారుడిగా ఒక ప్రాంతానికి జరిగిన అన్యాయాలను తన సినిమాలో చూపించాను. తన సినిమాను సీమాంద్ర పెట్టుబడి దారులు అడ్డుకోవడం ఎంత వరకు సబబు? అని ఆయన ప్రశ్నించారు.

    తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర ప్రజలు ఎవరూ వ్యతిరేకించడం లేదని, కొందరు పెట్టుబడి దారులు కావాలని కృత్రిమ ఉద్యమంగా సమైక్య చేయిస్తున్నారని నారాయణ రెడ్డి అన్నారు. తాను సీమాంధ్ర ప్రాంతీయుడినే అని, అక్కడి ప్రజల మనసులో ఏముందో తనకు తెలుసన్నారు. తాను గతంలో తీసిన సినిమాలు, తీయబోయే సినిమాలు అన్యాయానికి వ్యతిరేకంగా, వాటిని వేలెత్తి చూపే విధంగా ఉంటాయని, అదే తరహాలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాన్ని తన సినిమాలో చూపించానన్నారు.

    English summary
    Director and actor R.Narayana murthy fired at Seemandhra politicians for blocking 'Poru Telangana' in seemandhra region.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X