దొరికిపోయిన పూనమ్: అడ్డంగా బుక్ చేసిన ‘కత్తి’... మద్దతిస్తున్నట్లు ట్వీట్స్!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో ఆయన అభిమానులకు, కత్తి మహేష్ మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కత్తి మహేష్ నేరుగా పవన్ కళ్యాణ్ సినిమాలను, రాజకీయాలను టార్గెట్ చేస్తుండటంతో ఫ్యాన్స్ కత్తిని టార్గెట్ చేస్తున్నారు.
అయితే మధ్యలో హీరోయిన్ పూనమ్ కౌర్ కల్పించుకుని కత్తిని తప్పుబట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కత్తి..... పవన్ కళ్యాణ్-పూనమ్ కౌర్ మీద ఎవరూ ఊహించని ప్రశ్నలు సంధించిన సెన్సేషన్ క్రియేట్ చేశారు.

డిలీట్ చేసి దొరికిపోయిన పూనమ్ కౌర్
పవర్ స్టార్‌కు మద్దతు ఇచ్చిన కారణంగా కత్తి మహేష్ తనను దారుణంగా టార్గెట్ చేయడంతో పూనమ్ కౌర్ పవన్ సాయం కోరింది. ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.... ఈ పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ తనను బయటపడేయాలని, స్పందించాలని ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్స్ వెంటనే డిలీట్ చేసింది. ఇలా చేయడంతో పూనమ్ కౌర్ దొరికిపోనట్లయింది. ఆమె వాటిని డిలీట్ చేయక ముందే స్క్రీన్ షాట్స్ తీసిన కత్తి...... తన ట్విట్టర్ పేజీ ద్వారా బయట పెట్టారు.

అడ్డంగా బుక్ చేసిన కత్తి
పూనమ్ కౌర్ తన ట్వీట్లను తొలగించేందుకు కారణమైన పరిస్థితులు ఏంటి? అని ప్రశిస్తూ..... ఆమెను సోషల్ మీడియా వేదికగా అడ్డంగా బుక్ చేశారు కత్తి మహేష్.

పూనమ్ కౌర్‌కు మద్దతు ఇస్తున్నాను
ఈ వ్యవహారం నుంచి తనను పవన్ కళ్యాణ్ బయటపడేయాలని పూనమ్ కౌర్ కోరడాన్ని తాను స్వాగతిస్తున్నానని, ఈ విషయంలో తన మద్దతు తెలుపుతున్నానని కత్తి మహేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మొదటి ప్రశ్న
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కత్తి పూనమ్ కౌర్‌కు 6 ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. మీకు బ్రాండ్ అంబాసిడర్ గా పదవి ఎవరి వలన వచ్చింది? అని మహేష్ కత్తి మీడియా ముఖంగా ప్రశ్నించారు.

రెండో ప్రశ్న
తిరుమలలో పవన్ కళ్యాణ్ తో పాటు నిలబడి ఒకే గోత్ర నామాలతో మీరు పూజ ఎందుకు చేయించుకున్నారు?

మూడో ప్రశ్న
పవన్ కళ్యాణ్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏమిటి? ఆ బిల్స్ కట్టింది ఎవరు?

నాలుగో ప్రశ్న
పవన్ కళ్యాణ్ గారు మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అది నెరవేరిందా? లేదా?

ఐదో ప్రశ్న
దర్శకుడు త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకు అంత కోపం?

ఆరో ప్రశ్న
క్షుద్ర మాంత్రికుడు నరసింహం క్షుద్ర పూజ చేసినపుడు..... త్రివిక్రమ్, పవణ్ కళ్యాణ్ తో కలిపి అక్కడ మీరు ఏం చేశారో చెప్పగలరా?

ఈ ఆరు ప్రశ్నలకు నా వద్ద ఆధారాలు ఉన్నాయి?
నేను సంధించిన ఈ ఆరు ప్రశ్నలకు నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇక్కడికి పూనమ్ కౌర్ వచ్చి ఉంటే వాటిని బయటపెట్టే వాడిని... కానీ ఆమె రాలేదు. సమయం వచ్చినపుడు వీటికి తగిన ఆధారాలను బయట పెడతాను అని మహేష్ కత్తి తెలిపారు.


Click it and Unblock the Notifications











