»   » నెల రోజులుగా ఉలుకు పలుకు లేని సమంత, ఏమైంది?

నెల రోజులుగా ఉలుకు పలుకు లేని సమంత, ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా స్టార్లు అభిమానులకు టచ్ లో ఉండటానికి, తమ అనుభవాలను షేర్ చేసుకోవడానికి విరివిగా ఉపయోగిస్తున్న సోషల్ ఫ్లాట్ ఫాం ట్విట్టర్. సౌత్ స్టార్లలో ట్విట్టర్లో యాక్టింగ్ గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. తన సినిమాల విషయాలను, తను చేసే సేవా కార్యక్రమాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకోవడం ఆమెకు అలవాటు.

అంతే కాకుండా అభిమానులు సైతం సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేలా ట్విట్టర్ ద్వారా ఎంకరేజ్ చేస్తోంది సమంత. వివిధ అకేషన్స్ సందర్బంగా విషెస్ తెలుపడం, ఇతర స్టార్లకు పుట్టినరోజు సందర్భంగా గ్రీటింగ్స్ తెలుపడం లాంటివి చెబుతూ...ఎప్పుడూ ట్విట్టర్లో హడావుడి చేసేది ఈ బ్యూటీ. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా షూటింగు గ్యాపులో కనీసం ఒక్క ట్వీట్ అయినా ట్వీటేది.

What Made Samantha Go Inactive On Twitter?

అయితే గత నెల రోజులుగా సమంత ట్విట్టర్ మూగ బోయింది. కనీసం న్యూ ఇయర్ విషెస్ కూడా తెలుపలేదు. పొంగల్ సందర్భంగా ఒక్క ట్వీటు కూడా చేయలేదు. డిసెంబర్ 27న ఆమె చివరి సారిగా ట్వీట్ చేసింది. సమంత ఇలా ఉన్నట్టుండి ఎందుకు ట్విట్టర్ కు దూరం అయిందో తెలియక, ఆమె నుండి ఒక్క ట్వీటు కూడా లేక చాలా డిసప్పాయింటుగా ఉన్నారు అభిమానులు.

సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ...ఆ' సినిమాతో పాటు, సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘24', మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం', విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘తేరి'లో నటిస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్', తమిళంలో ‘వడ చెన్నై' అనే సినిమాకు కమిటైంది. ఈ సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే ఆమె ట్విట్టర్ కు దూరంగా ఉంటోందనే వాదన కూడా ఉంది.

    English summary
    It is known Samantha is one of the most active users on Twitter among t-town celebrities and, the actress also meets her twitter followers once in a while, during her birthdays. However, the actress went inactive from a while, which is now worrying her followers a lot. Her last tweet was a month ago and it is surprising that Sam did not even wish her followers on the New Year.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu