బాద్ షాను ఏడిపించిన ఆ సంఘటనలేంటి?
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హిందీ చిత్ర సీమలోని మోస్ట్ సక్సెస్ పుల్ హీరోల్లో ఒకరు. రొమాంటిక్ హీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ ఒకానొక సందర్భంలో తిరుగులేని హీరోగా చక్రం తిప్పారు. అయితే అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. కొన్ని ప్రతికూల సందర్భాలు కూడా ఉంటాయి. షారుక్ జీవితంలో కూడా అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. గంటల కొద్దీ ఏకధాటిగా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొన్ని పరిస్థితులు ఆయన్ను తీవ్రంగా క్రుంగ దీసాయి. తను నిర్మాతగా రూపొందిన రా.వన్ సినిమాతో పాటు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విషయంలో షారుక్ ఎంతో నష్టపోయాడు. అందరూ అతని ఉద్దేశ్యాలను మరియు సమగ్రతను ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన ఎంత కుమిలిపోయాడో ఆయనకే తెలుసు.
ఓ ప్రముఖ ఫిల్మ్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ అప్పుడు తను పడ్డ మనో వేదనను వెల్లడించారు. ప్రతి కూల పరిస్థితులు తనను చుట్టుముట్టినప్పుడు బాత్రూమ్ లో కూర్చుని గంటల తరబడి ఏడ్చేవాట. 'మేము వరుసగా 9 మ్యాచ్ లు ఓడిపోయాం. మ్యాచ్ లు లాసైనందుకు నేను ఏడ్వలేదు. తర్వాతి రోజు నాపై కొందరు చేసిన కామెంట్లు నాకు ఏడుపు తెప్పించాయి. నేను క్రీడలను ఎంతో ప్రేమిస్తాను. అండర్ 19 క్రికెట్ లో కూడా నేను ఆడాను. కానీ కొందరు చేసిన కామెంట్లు నన్ను తీవ్రంగా బాధించాయి' అని షారుఖ్ ఖాన్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












