»   » ప్రధాని మోడీ ముందు అసభ్యకరమైన డ్రెస్: ప్రియాంక సమాధానం ఇదీ!

ప్రధాని మోడీ ముందు అసభ్యకరమైన డ్రెస్: ప్రియాంక సమాధానం ఇదీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల బెర్లిన్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ విమర్శలకు కారణమైంది. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తులను కలిసేప్పుడు ఇలా తొడలు కనిపించేలా అసభ్యమైన డ్రెస్ ఏమిటీ అంటూ సోషల్ మీడియాలో ఆమెపై విమర్శల వర్షం కురిసింది.

ప్రియాంక చోప్రా తను నటించిన హాలీవుడ్ మూవీ 'బేవాచ్' ప్రమోషన్లో భాగంగా జర్మనీ రాజధాని బెర్లిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగానే అక్కడ ప్రధాని మోడీ ఉండటంతో ఆయనతో భేటీ అయ్యారు.

అనంతరం ఆమె మోడీతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసారు. ఆమె అలా ఫోటోలు పోస్టు చేసిన వెంటనే ఇలా విమర్శల వర్షం మొదలైంది.

విమర్శలకు సమాధానంగా ప్రియాంక చేసిన పోస్ట్ ఇదే...

తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా మరో ఆసక్తికర పోస్టు చేసింది ప్రియాంక. లెగ్స్... మా అమ్మ మధు చోప్రా జీన్స్ నుండి వచ్చాయి. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అనే అర్థం వచ్చేలా ప్రియాంక ఈ ఫోటో పోస్టు చేసింది.

బేవాచ్

ప్రియాంక నటించిన హాలీవుడ్ మూవీ ‘బేవాచ్' విషయానికొస్తే..... జూన్ 2న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు.

విలన్ రోల్

విలన్ రోల్

బేవాచ్ మూవీలో ప్రియాంక చోప్రా అత్యంత కీలకమైన విలన్ పాత్రలో నటిస్తోంది. ఆమె నటిస్తున్న తొలి హాలీవుడ్ మూవీ కూడా ఇదే. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే హాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉంది ప్రియాంక.

 డ్వేన్ జాన్సన్

డ్వేన్ జాన్సన్

హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సెత్‌ గొర్డాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1990లో టెలివిజన్‌ సిరీస్‌గా ప్రసారమై 'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా అదే టైటిల్‌తో ఈ సినిమాను తీస్తున్నారు.

English summary
Priyanka's meeting with PM Modi received criticism on social media as Twitter thought that the actress 'wasn't properly dressed to meet a national leader.' "Priyanka, you were sitting with the Prime Minister of our country. You should have at least had the basic sense of covering your legs," read one of the comments. However, Priyanka Chopra seems unperturbed and wrote a cryptic message on Instagram. "Legs for days... #itsthegenes with madhuchopra nights out in #Berlin," she captioned an image of herself with her mother. In the picture, Priyanka looks chic in a slit denim dress while her mother wears a short skirt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu