twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భార్య పుట్టిన రోజుకు రామ్ చరణ్ ఇచ్చిన సర్పైజ్ గిప్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ తేజ తన బార్య ఉపాసన వివాహం అయ్యాక జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజుకు ఓ ఆశ్చర్యకరమైన గిప్ట్ ఇచ్చి సర్పైజ్ చేసారు. ఐర్లాండ్ నుంచి తెప్పించిన మినియేచర్ లాంటి అతి చిన్న గుర్రం ఆమెకు ప్రెజెంట్ చేసారు. ఆమె ఈ గిప్ట్ తీసుకుని తన పుట్టిన రోజుకు ఇన్నాళ్లలో ఇంత అధ్బుతమైన గిప్ట్ రాలేదని చెప్పటం అతనికి ఆనందాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ... "ఆమెను ఓ ఖరీదైన డైమండ్ నక్లెసో, లేక కారో గిప్ట్ గా ఇచ్చినా ఇంతలా సంబరపడేది కాదు" అన్నారు.

    అలాగే... "ఆమె పుట్టిన రోజు నా జీవితంలో ఓ స్పెషల్ మూవెమెంట్. నేను దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల పాటు ఈ గిప్ట్ ని ఎంపిక చేసి ఐర్లాండ్ నుంచి తెప్పించటానికి శ్రమ పడ్డాను. నా శ్రమ నాకు ఆనందాన్ని తెచ్చి పెట్టింది. ఈ గిప్ట్ కోసం చిరంజీవి ప్యామిలీ కూడా దృష్టి పెట్టింది. ఇది అరుదైన బ్రీడ్. ఓ సైలర్ ప్రెండ్ ఈ గుర్రం సరైన సమయానికి తెచ్చివ్వటానికి సహాయపడ్డారని చెప్తున్నారు. ఈ గుర్రం 31 ఇంచెలు దాకా పెరుగుతుంది. అలాగే పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు దాకా లైఫ్ స్పాన్ తో బ్రతుకుతుంది" అన్నారు.

    ఇంకా ఇదే విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ "మా అమ్మ మా ఇంటి వెనకాల ఉండే ఆమె గార్డెన్ లో ఈ గుర్రంకి ఎయిర్ కండీషన్ తో ఓ షెల్టర్ కట్టించటానికి ఒప్పుకుంది. ఈ గుర్రం మా కుటుంబానికి ఓ గర్వ కారణం. ఇప్పటివరకూ మా మదర్ నా గుర్రాలను వేటినీ ఆ గార్డెన్ లోకి రానివ్వలేదు. కానీ దీనికి పర్మిషన్ ఇచ్చింది అన్నారు. ఈ గుర్రం తనకీ, తన భార్యకి, కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇస్తోందని, చాలా ముద్దుగా ఆ గుర్రం ఉందని" చెప్పుకొచ్చారు.

    ఇక తన ట్విట్టర్ ఎక్కౌంట్ క్లోజ్ చేసిన విషయమై మాట్లాడుతూ.. "ట్విట్టర్ ఎక్కౌంట్ రకరకాల సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా నా ప్రెవసీని దెబ్బకొడుతోంది. నేను ప్రత్యేకంగా నా స్నేహితులని ఎవరైనా భర్తడే విషెష్.. ట్విట్టర్ లో చెపితే.. ఫోన్ చేయకండా ట్విట్టర్ లో పెడుతున్నాడు... ఆ స్టార్ తో నాకు విభేధాలు వచ్చాయంటూ పెడర్దాలు తీస్తున్నారు. దాంతో నేను మళ్లీ వివరణ ఇఛ్చుకోవాల్సి వస్తోంది. వీటిన్నటి కన్నా నా రిలేషన్స్ నిలుపుకోవటానికి ట్విట్టర్ ఎక్కౌంట్ డిలేట్ చేయటమే బెస్ట్ అనిపించింది" అని చెప్పారు.

    English summary
    Ram Charan Teja gifted his wife A Shetland pony for her birthday. The star had been meaning to gift the miniature horse to Upasana for their wedding but finally managed to surprise her on her birthday and it turned out to be the best gift ever.“It was one of those special moments in our life; she was taken by surprise with this cute-looking animal and I was floored when she said that it was the best birthday gift she had ever received. My four or five months’ effort to get it shipped from Ireland has paid off. I am not sure whether she would have reacted the same way if I had gifted a diamond set or a car,” says Ram Charan with a hint of pride.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X