బాహుబలి2లో షారుక్ పాత్ర అద్భుతమట! సూర్య, మోహన్‌లాల్ నో..
బాహుబలి2లో బాలీవుడ్ సూపర్ స్టార్ ఓ అద్భుతమైన పాత్రలో పోషించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే అటు షారుక్ ఖాన్ గానీ, దర్శకుడు రాజమౌళి గానీ పెదవి విప్పడం లేదు. దాంతో ఈ విషయం ఫిలిం సర్కిళ్లలో చర్చనీయ
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి2లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించాడనే వార్త ఇటీవల కాలంలో జోరందుకున్నది. ఈ విషయంపై పత్రికలు కథనాలు అనేకంగా వెల్లడిస్తున్నా.. అటు షారుక్ ఖాన్ గానీ, దర్శకుడు రాజమౌళి గానీ పెదవి విప్పడం లేదు. దాంతో ఈ విషయం ఫిలిం సర్కిళ్లలో చర్చనీయాంశమైంది.

శాంతిదూతగా షారుక్
బాహుబలి2లో షారుక్ పోషించిన పాత్ర చాలా కీలకమైందట. ప్రభాస్, రానాల నడుమ మధ్యవర్తిత్వం జరిపే ప్రభావవంతమైన పాత్రను ఆయన పోషించినట్టు తెలుస్తున్నది. వారిద్దరి మధ్య ఉన్న వైరుధ్యాన్ని తగ్గించే శాంతిదూతగా అవతారమెత్తినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఉన్న అద్భుతమైన సీన్లలో షారుక్ నటించిన సన్నివేశం హైలెట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తున్నది. ఒకవేళ ఈ వార్త నిజమైతే షారుక్ నటించిన చిత్రం మూడు భాషల్లోకి డబ్బింగ్ అవుతుంది.

సామ్రాట్ అశోకుడిగా షారుక్
2001లో విడుదలైన సామ్రాట్ అశోక చిత్రంలో షారుక్ నటించాడు. మౌర్య వంశంలోని గొప్ప సామ్రాజ్యాధినేత అశోకుడి పాత్రను షారుక్ పోషించాడు. ఈ చిత్రం సమ్రాట్ అశోకా పేరుతో పలు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రముఖ ఫొటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో షారుక్ తోపాటు కరీనా కపూర్, అజిత్, డానీ తదితరులు నటించారు.
విలక్షణ నటులు సూర్య, మోహన్‌లాల్ నో
ఈ చిత్రంలో షారుక్ పోషించినట్టుగా భావిస్తున్న పాత్ర కోసం తొలుత తమిళ సూపర్ స్టార్ సూర్య, మలయాళ అగ్రనటుడు మోహన్‌లాల్‌ను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఒకవేళ ఈ వార్త వాస్తవమైతే.. వారు ఈ పాత్రను చేయకపోవడమెనుక కారణమేంటో అంతుపట్టని విషయంగా మారింది.

ఏప్రిల్ 28న విడుదలకు ముస్తాబు
బహుబలి2 షూటింగ్ చాలా రోజులుగా జరుగుతున్నది. జనవరి తొలివారంలో షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకొన్నది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నది. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి బయటకు వస్తున్న విషయాలు పరిశ్రమలో సంచలనం రేపుతున్నది.

బుసాన్ ఏషియన్ ఫిల్మ్ మార్కెట్‌లో..
అత్యున్నత సాంకేతిక అంశాలతో తెరకెక్కుతున్న బాహుబలి2 చిత్రంపై దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తాజాగా బుసాన్ ఏషియన్ ఫిల్మ్ మార్కెట్‌లో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి1 సృష్టించిన ప్రభంజనంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా అంచనాలు పెంచుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











