పడకపై మీ ఫేవరెట్ పొజిషన్ ఏమిటి? తెలివిగా సమాధానం చెప్పి హీరోయిన్!
బాలయ్యతో లెజెండ్, లయన్ లాంటి చిత్రాల్లో నటించడం ద్వారా తెలుగులో పాపులర్ అయిన రాధిక ఆప్టే తాజాగా ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. పలు బోల్డ్ స్టేట్మెంట్స్, సినిమాల్లో వివాదాస్పద పాత్రలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రాధిక ఆప్టే నేహా దూపియా హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేహా అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
బెడ్ పైన మీ ఫేవరెట్ పొజిషన్ ఏమిటి? అంటూ నేహా ఓ ప్రశ్న సంధించగా....రాధిక ఆప్టే ఏ మాత్రం కంగారు పడకుండా సమాధానం ఇచ్చింది. 'నేను ఒంటరిగా పడుకుంటాను. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు' అంటూ తెలివిగా రిప్లై ఇచ్చింది.

నేహా దేపియా.... ఈ ప్రశ్న అడగటం ద్వారా రాధిక ఆప్టే ఫేవరెట్ సెక్స్ పొజిషన్ ఏమిటి? అనే సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది. అయితే మరో ప్రశ్నకు తావులేకుండా దాన్ని అక్కడికక్కడే కట్ చేసే ప్రయత్నం చేశారు.
రాధిక ఆప్టే సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన హిందీ చిత్రాలు బజార్, భవేష్ జోషి, బొబైరియా, రెండో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 'ఉలా' అనే తమిళ చిత్రంలో, 'షూట్ ది పియానో ప్లేయర్' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











