twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో వైరల్: షారుక్ ఖాన్ షోలో దీపిక కంటతడి, ఏం జరిగింది?

    షారుక్‌ ఖాన్‌ ‘బాతే విత్‌ ద బాద్‌షా’ అనే టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.తొలి ఎపిసోడ్ లో దీపిక అతిథిగా వచ్చింది. ఈ షోలో ఆమె కంటతడి పెట్టడం చర్చనీయాంశం అయింది.

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ స్టార్ షారుక్‌ ఖాన్‌ 'బాతే విత్‌ ద బాద్‌షా' అనే టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిసెంబర్ 2 నుండి ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ షో తొలి ఎపిసోడ్‌కు అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ విచ్చేశారు.

    తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఇందులో దీపిక పదుకోన్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడం, షారుక్ లేచి ఆమె కన్నీళ్లు తుడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఈ షోలో ఏం జరిగింది? దీపిక ఎందుకు కంటతడి పెట్టాల్సి వచ్చింది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం.

    దీపిక పదుకోన్ కంటతడికి కారణం ఇదే

    దీపిక పదుకోన్ కంటతడికి కారణం ఇదే

    షారుక్ ఖాన్ ఈ షోలో దీపిక తల్లి ఉజ్జల రాసిన లేఖను చదివి వినిపించారు. తన కుమార్తెపై ప్రేమను తెలుపుతూ ఆమె ఈ లేఖ రాశారు. దీపిక సాధించిన విజ‌యాలు, ఎదుర్కొన్న కష్టాలు, వాటిని అధిగమించి దీపిక ఈ స్థాయికి రావడానికి చేసిన కృషి గురించి ఆమె ఈ లేఖలో రాశారు.

    దీపిక కన్నీళ్లు తుడిచిన షారుక్

    దీపిక కన్నీళ్లు తుడిచిన షారుక్

    భావోద్వేగానికి గురై దీపిక కంటతడి పెట్టడంతో షారుక్ స్వయంగా స్వయంగా లేచి ఆమె కన్నీళ్లు తుడవటం విశేషం. షారుక్ ఖాన్, దీపిక మధ్య మంచి స్నేహితులు. షారుక్ మూవీ ఓం శాంతి ఓం సినిమా ద్వారా దీపిక హీరోయిన్ గా పరిచయం అయింది. ఇపుడు షారుక్ ప్రారంభించిన టాక్ షోకు కూడా ఆమెనే తొలి అతిథిగా రావడం గమనార్హం.

    మా ఇంట్లో అమ్మే రియల్ హీరో

    మా ఇంట్లో అమ్మే రియల్ హీరో

    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకోన్ తన తల్లి ఉజ్జల గురించి మాట్లాడారు. అనేక విషయాల్లో తనకు తన తల్లే స్ఫూర్తి అని తెలిపారు. తమ ఫ్యామిలీకి ఆమె వెన్నముఖ లాంటిదని తెలిపారు. నాన్న, నేను, చెల్లి సెలబ్రిటీలం.... ఆమె మాత్రం స్పాట్ లైట్లోకి రాలేదు. మా వెనక ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. మా ఫ్యామిలీలో రియల్ హీరో ఆమెనే అని తెలిపారు.

    పద్మావతి వివాదంపై

    పద్మావతి వివాదంపై

    ఈ షోలో దీపిక ‘పద్మావతి' వివాదం గురించి స్పందించారు. ఈ సినిమాలో నటించడంపై విమర్శలు వస్తున్నాయి. విమర్శల నుంచి కొత్త విషయాల్ని నేర్చుకుంటుంటా. వీటి వల్ల ప్రతిసారి మానసికంగా పరిణతి చెందిన భావన కలుగుతుంది. ప్రజలు నన్ను ఏయే విషయాల్లో విమర్శిస్తుంటారో.. ఆయా కోణాల్లో నన్ను నేను చక్కదిద్దుకోవాలి అనుకుంటుంటా' అని తెలిపారు.

    English summary
    Shahrukh Khan is quite known for his gentlemanly behaviour. So it would come as a surprise to you when we say that the King of Romance just left Deepika Padukone all emotional!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X