అగ్నిప్రమాదం: శ్రీదేవి ఏం పోగొట్టుకుంది?
ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. కూతురు జాన్వీ గది నుంచి తొలుత పొగలు వచ్చాయి. ఆ తర్వాత మంటలు రెండో అంతస్థులోని పడక గదికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో శ్రీదేవికి, జాన్వీకి సంబంధించిన పలు వస్తువులు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
పడకగది మొత్తం ధ్వంసమైనట్లు శ్రీదేవి పర్సనల్ ఫ్రెండ్ ఒకరు చెప్పినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ రాసింది. అయితే, శ్రీదేవికి అత్యంత ఇష్టమైనవి కొన్ని ఈ ప్రమాదంలో దగ్ధమైనట్లు తెలుస్తోంది. శ్రీదేవి మంచి చిత్రకారిణి అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది.
గోడకు వేలాడదీసిన ఆమె పెయింటింగ్స్ కొన్ని దగ్ధమైనట్లు సమాచారం. అందులో మైకెల్ జాక్సన్ పెయింటింగ్ కూడా ఉందని చెబుతున్నారు. శ్రీదేవికి అత్యంత ఇష్టమన ఆర్ట్ వర్క్స్‌లో అది కూడా ఒకటి. మైఖెల్ జాక్సన్ వర్ధంతి సందర్భంగా ఆ పెయింటింగ్‌ను శ్రీదేవి తన కూతురికి బహుమతిగా ఇచ్చింది.
ప్రముఖ నటి శ్రీదేవి, బోనికపూర్ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ముంబై అందేరి లోఖండ్‌వాలాలోని శ్రీదేవి గృహంలో శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీదేవి బెడ్‌రూమ్‌లోని ఎయిర్ కండిషనర్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీనివల్ల పడగ్గది పూర్తిగా ధ్వంసమైంది.
ఆ సమయంలో ఇంట్లో శ్రీదేవితో పాటు ఆమె అత్తగారు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనంతరం అత్తగారిని సంజయ్ కపూర్ గృహానికి పంపించారు. శ్రీదేవి కుటుంబం స్థానిక హోటల్లో బసచేసింది.


Click it and Unblock the Notifications












