తొలిసారి పోర్న్ మూవీ చూసిన సన్నీలియోన్, వెక్కి వెక్కి ఏడ్చిన వైనం.. ఆన్‌లైన్‌లో లీక్!
Recommended Video

ఇండో కెనడా భామ సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా పలు అడల్ట్ చిత్రాల్లో నటించింది. పోర్న్ స్టార్ గానే బాగా పాపులర్ అయింది. సన్నిలియోన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెని నిర్మాతలు బాలీవుడ్ కు తీసుకుని వచ్చారు. ఇక పోర్న్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ పై దృష్టి పెట్టడంతో సన్నీలియోన్ తక్కువ సమయంలోనే స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలో సాగె ఐటమ్ సాంగ్ కు సైతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే నటిగా సన్నీలియోన్ మారిపోయింది. సన్నీ జీవితంపై బయోపిక్ వెబ్ సిరీస్ గా తెరకెక్కింది. కరంజిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది.

తన బయోపిక్‌లో తానే
సన్నీలియాన్ తన బయోపిక్ లో తానే నటించింది. తన జీవిత చరిత్రపై తెరకెక్కిన బయోపిక్ వెబ్ సిరీస్ లో తానే నటించడం ఛాలెంజింగ్ విషయం అని సన్నీలియోన్ తెలిపింది.

ఇంకా చాలా ఉన్నాయి
తన బయోపిక్ లో చూపించిన విధంగా తన కన్నీటి గాధలన్ని రియల్ లైఫ్ లో అనుభవించానని సన్నీలియోన్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది. సినిమాలో చూపించలేని దారుణమైన సంఘటనలు కూడా తన జీవితంలో జరిగాయని సన్నీలియోన్ తెలిపింది.

ఆ సన్నివేశం గురించి
ఈ బయోపిక్ లో ఆసక్తికరమైన సన్నివేశం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. పోర్న్ చిత్రాల ప్రపంచంలో సన్నీలియోన్ టాప్ లోకి దూసుకుపోయింది. అలాంటి సన్నీలియోన్ కేవలం పోర్న్ సినిమా చూస్తేనే వెక్కి వెక్కి ఏడ్చిందనే విషయం అందరికి తెలియదు.

తొలిసారి పోర్న్ చిత్రం చూసి
సన్నీలియోన్ తొలిసారి టీనేజ్ లో ఉన్న సమయంలో పోర్న్ సినిమా చూసిన సన్నివేశాన్ని చూపించారు. పోర్న్ చిత్రం చూశాక సన్నిలియోన్ వెక్కి వెక్కి ఏడుస్తుంది. బాబా గురునానక్ చిత్ర పటం పై చేయి పెట్టి తప్పు చేశాను.. క్షమించు అంటూ వేడుకుంటుంది.

అలాంటి సన్నీలియోన్
పోర్న్ సినిమా చూస్తేనే తప్పు అనే మైండ్ సెట్ తో ఉన్న సన్నీలియోన్ పోర్న్ చిత్రాల్లో నటించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనే విషయాలని ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.

ఆన్‌లైన్‌లో లీక్
వెబ్ సిరీస్ గా రూపొందించిన సన్నీ బయోపిక్ కు సైతం పైరసీ షాక్ తప్పలేదు. వెబ్ సిరీస్ లోని కొన్ని ఎపిసోడ్స్ పైరసీ రూపంలో లీక్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన ఎపిసోడ్స్ లీక్ కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











