»   » ఎంగేజ్మెంట్ రద్దు: మరి త్రిష ఇపుడు ఏం చేస్తోంది?

ఎంగేజ్మెంట్ రద్దు: మరి త్రిష ఇపుడు ఏం చేస్తోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిష ఎంగేజ్మెంట్ వరుణ్ మణియన్ తో ఆ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ రద్దయింది, ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయని, ఇక వీరు పెళ్లి చేసుకునే అవకాశం లేదని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఇటు త్రిష గానీ, అటు వరుణ్ మణియన్ గానీ స్పందించడం లేదు. వీరు మౌనంగా ఉండటాన్ని బట్టి వీరి ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు వెళ్లక ముందే పెటాకులైందని స్పష్టమవుతోంది.

వరుణ్ మణియన్ ప్రొడక్షన్ హౌస్ సినిమా రిజెక్ట్ చేసినప్పటి నుండే ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలంగా త్రిష వరుణ్ మణియన్ కు దూరంగానే ఉంటోంది. ప్రస్తుతం త్రిష తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తీసి పక్కన పడేసిందని టాక్. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఇటీవల వరుణ్ మణియన్...సోదరి వివాహ వేడుకకు కూడా త్రిష హాజరు కాలేదు. మరి ఆ సమయంలో ఏమైనా షూటింగులో బిజీగా ఉందా? అంటే అదీ లేదు. తన స్నేహితులతో కలిసి చెన్నైలో పార్టీల్లో మునిగి తేలిందట. ఈ పరిణామాలు ఇద్దరూ విడిపోయారనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

వరుణ్ తో విడిపోయిన తర్వాత .....ఎప్పటి లాగే త్రిష తన సినిమా షూటింగులకు వెళ్లడం, ఖాళీ సమయాల్లో స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ లైఫ్ లాగించేస్తోందట.

స్నేహితులతో కలిసి త్రిష

స్నేహితులతో కలిసి త్రిష

ఇటీవల ఓ తమిళ ప్రాజెక్టు పూర్తి చేసుకున్న త్రిష.....తర్వాత ప్రాజెక్టు మొదలడానికి సమయం ఉండటంతో తన స్నేహితులతో గడుపుతోంది.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందనే విషయం బటయకు రాలేదు.

ఎంగేజ్మెంట్ తర్వాత

ఎంగేజ్మెంట్ తర్వాత

అప్పటి వరకు ఒకరినొకరు పిచ్చ పిచ్చిగా ప్రేమించుకున్న త్రిష, వరుణ్....ఎంగేజ్మెంట్ తర్వాత విడిపోయే స్థితికి చేరుకున్నారు.

త్వరలో...

త్వరలో...

రహస్యాలు ఎక్కువ కాలం ఆగడవు. ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం త్వరలోనే బయటకు రానుంది.

Read more about: trisha, త్రిష
English summary
Trisha calling off her engagement has been the most sensational news of late in the film circles. Though the reasons were not known, her alleged break up with Varun Manian has been gaining the strength day by day, because of Trisha's unusual silence.
Please Wait while comments are loading...