"నువ్ గంటవాయిస్తే, నేను నిన్ను వాయిస్తా" అన్న భర్త మాటలని ఇలా వెనకేసుకొచ్చింది

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బూతుమాట మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైతున్న' ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్' కార్యక్రమనికి న్యాయ నిర్ణేతగా అక్షయ్, సహ జడ్జి గా వచ్చిన కమెడియన్ మల్లిక దువాపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్దాడు. ' మల్లికా జీ..! ఆప్ బెల్ బజావ్.. మై ఆప్ కో బజాతా హు' (మల్లికా జీ మీరు బెల్‌ మోగిస్తే.. నేను మీ బాండ్‌ మోగిస్తాను) అని అక్షయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

 బెల్‌ను మోగించొచ్చు

బెల్‌ను మోగించొచ్చు

షోలో భాగంగా కంటస్టెంట్స్‌ అద్భుతంగా పర్ఫార్మెన్స్‌ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్‌ను న్యాయనిర్ణేతలు మోగించొచ్చు. షోకు అక్షయ్‌ కుమార్‌తో పాటు కమెడియన్‌ మల్లికా దువా న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. ఓ కంటెస్టంట్‌ అద్భుతంగా పర్ఫార్మెన్స్‌ చేయడంతో మల్లికా బెల్‌ను మోగించబోయారు.

నేను మీ బాండ్‌ మోగిస్తాను

నేను మీ బాండ్‌ మోగిస్తాను

ఆమెను వారించబోతూ.. " మల్లికా జీ మీరు బెల్‌ మోగిస్తే.. నేను మీ బాండ్‌ మోగిస్తాను" అంటూ అక్షయ్‌ అనటం మరీ దారుణం గా ద్వనించింది. ఈ బూతులపై స్పందించిన మల్లిక దువా తండ్రి, జర్నలిస్టు వినోద్ దువా, అక్షయ్‌పై విరుచుకుపడ్డాడు. ‘ఇది అతని సెన్సార్ హ్యూమర్ భాష .. స్టార్‌ప్లస్ వాళ్లూ.. ఇప్పటికైనా మేలుకోండి' అని వినోద్ తన ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు.

 అక్షయ్ మల్లికకు క్షమాపణ చెప్పాల్సిందే

అక్షయ్ మల్లికకు క్షమాపణ చెప్పాల్సిందే

దాంతోపాటుగా అనుచిత వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను కూడా పోస్టు చేశారు. దీనికిగాను అక్షయ్ మల్లికకు క్షమాపణ చెప్పాల్సిందేనని వినోద్ డిమాండ్ చేస్తున్నారు. మల్లిక కూడా ఈ వీడియోను పోస్టు చేసి ఈ కార్యక్రమాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమం అంటారా అని ప్రశ్నించింది. స్టార్ ప్లస్ మాత్రం అక్షయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను ప్రసారం చేయలేదు.

 ట్వింకిల్ మాత్రం భర్తనే వెనకేసుకొచ్చింది

ట్వింకిల్ మాత్రం భర్తనే వెనకేసుకొచ్చింది

ఇక అక్షయ్‌ మల్లికను ఉద్దేశించి అభ్యంతరకరంగా కామెంట్‌ చేశారంటూ సోషల్‌మీడియాలో దుమారం రేగింది. ఈ విషయంపై స్పందించాలంటూ పలువురు ట్వింకిల్‌ ఖన్నాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేశారు. అయితే ఆ ట్వీట్లకి సమాధానంగా ట్వింకిల్ మాత్రం భర్తనే వెనకేసుకొచ్చింది.

 కాంట్రవర్సీపై రియాక్ట్ అవుతున్నా

కాంట్రవర్సీపై రియాక్ట్ అవుతున్నా

ఈ కాంట్రవర్సీపై ఇప్పుడు అఫీషియల్ గా రియాక్ట్ అయింది అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా. 'లాఫ్టర్ ఛాలెంజ్ సెట్స్" లో నేను ఈ కాంట్రవర్సీపై రియాక్ట్ అవుతున్నా. బజాయించడం అనే మాట బాగానే వింటూ ఉంటాం. చాలామంది మగవాళ్లు.. ఆడవాళ్లు కూడా ఈ మాట అంటూనే ఉంటారు.

 రెడ్ ఎఫ్ ఎమ్, ట్యాగ్ లైన్ బజాతే రహో

రెడ్ ఎఫ్ ఎమ్, ట్యాగ్ లైన్ బజాతే రహో

ఆఖరికి రెడ్ ఎఫ్ ఎంకు కూడా ట్యాగ్ లైన్ బజాతే రహో అనే ఉంటుంది' అంటూ తన భర్త కామెంట్స్ ను సపోర్ట్ చేసింది ట్వింకిల్ ఖన్నా. మల్లికా దువా తండ్రి ఈ వివాదంలో చాలా గట్టిగానే రియాక్ట్ కాగా.. ట్వింకిల్ ఖన్నా ఇప్పుడీ వివాదంపై తన స్టైల్ లో కొన్ని జోక్స్ పేల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X