twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ స్టార్ జీవితంలో బిగ్గెస్ట్ షాక్...ఆ హత్యే!

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మరణం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. మరో వైపు ఆయన మరణం తర్వాత రాజేష్ ఖన్నాజీవితంలో ఆసక్తికర విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజేష్ ఖన్నా జీవితంలో బిగ్గెస్ట్ షాకింగ్ సంఘటన ఏమిటో తాజాగా వెల్లడైంది.

    భారతీయ సినిమా రంగంలో టాప్ రేంజికి ఎదిగిన రాజేష్ ఖన్నాను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరుపున ఎంపీగా కూడా పని చేశారు. రాజీవ్ గాంధీ అంటే ఖన్నాకి అమితమైన అభిమానం. మే 21, 1991న జరిగిన రాజీవ్ గాంధీ హత్య రాజేష్ ఖన్నాను తీవ్రమైన షాక్‌కు గురి చేసింది. ఈ విషయాన్ని రాజేష్ ఖన్నా తన సన్నిహితులతో చెప్పేవారని ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీ ప్రచురించింది.

    "ప్రియమైన మిత్రులారా.. సోదరీ సోదరులారా.. జరిగిపోయినదాని గురించి బాధపడటం, జరుగుతున్నదాని గురించి చింతించడం నాకు అలవాటు లేదు. మనం ఎప్పుడూ భవిష్యత్ వైపు దృష్టి సారించాలి. కానీ, కొన్ని సందర్భాల్లో, కొందరిని కలిసినప్పుడు మాత్రం పాత జ్ఞాపకాలన్నీ తిరిగి కళ్ల ముందు కదలాడుతాయి'' అని రాజేశ్ ఖన్నా తన అభిమానులకు చివరి సందేశం ఇచ్చారు.

    రాజేష్ కన్నా కోరిక మేరకు బాంద్రాలోని ఆయన బంగ్లా 'ఆశీర్వాద్'ను మ్యూజియంగా మార్చే అవకాశాలున్నట్లు ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. ఐతే ఈ బంగ్లాను మ్యూజియంగా మార్చే విషయంలో తుది నిర్ణయం ఆయన కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నాలే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

    English summary
    When Bollywood's ultimate romantic star Rajesh Khanna breathed his last, a few weeks back, it was a shock to the entire nation. But, most of us are actually unknown about Kaka's biggest shock of life. Many of you might not know this, Kaka was very fond of our former Prime Minister Rajiv Gandhi and credited him for his introduction to politics. According to a leading daily's version, Kaka used to call Rajiv Gandhi's assassination as 'the biggest shock of his life.'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X