»   » అనుష్క అర్థరాత్రిలో అక్కడ...దర్శనమిచిందా...!?

అనుష్క అర్థరాత్రిలో అక్కడ...దర్శనమిచిందా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన తాజా చిత్రం 'వేదం" ప్రమోషన్ కోసం మేకప్ తీసేసి మెకానిక్ లా మారిన అల్లు అర్జున్ స్లమ్ ఏరియాల్లో కేబుల్ కనెక్షన్స్ ఇస్తానంటూ నిన్నంతా కష్టపడి కార్ లో తిరిగి చాలా ఇల్లకు కేబుల్ కనెక్షన్ ఇచ్చి టీవీలు బాగా వస్తూన్నాయా లేదా అని చూడటం లేక పోతే టీవీలు రిపేర్ చేయడం మొదలెట్టాడు. ఆ తతంగాన్నంతా టీవీల్లో టెలికాస్ట్ చేయించేసి ఏదో కొత్తగా ప్రమోషన్ చేస్తున్నట్టు 'వేదం" టీమ్ కలర్ ఇస్తోంది కానీ అదంతా బాలీవుడ్ ప్రచార ధోరణి ప్రభావమేనని అందరికీ తెలుసు.

'వేదం" లో బన్నీ కేబుల్ రాజు కనుక కాలనీలకెళ్ళి కనెక్షన్లనివ్వొచ్చు. మనోజ్ రాక్ స్టార్ కాబట్టి పబ్బుల్లో దూరి పాటందుకోవచ్చు. మరి వేశ్య పాత్ర చేసిన అనుష్కని ఎక్కడికి పంపుతారో...ఏం చేయిస్తారో...పాపం..! రేపు ఏ అర్థరాత్రి వేళలోనో బార్ ల దగ్గరో, బస్టాప్ ల దగ్గరో, చీకటి సందుల్లోనో, వీధలు మలుపుల్లోనో హఠాత్తుగా అనుష్క దర్శనమిస్తే పాపం తనని వస్తావా అని అడక్కండి...'వేదం" ప్రమోషన్ కోసం వచ్చుంటుందని అర్థం చేసుకోండి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu