రచ్చ మొదలైంది: హీరో సూర్య...బాహుబలి

By Srikanya

హైదరాబాద్ : హీరో సూర్య...రాజమౌళి బాహుబలిలో కనిపించనున్నారా...అంటూ రూమర్స్ మొదలయ్యాయి. గతంలో ఇలాంటి రూమర్స్ వచ్చి ఆగిపోయాయి. మళ్లీ రీసెంట్ గా మొదలయ్యాయి. దానికి కారణం...రాజమౌళి..బాహుబలి షూటింగ్ జరతుగుతున్న ప్లేస్ లో...సూర్య కనపడటం. అయితే సూర్య అక్కడ ఫిల్మ్ సిటీలో ప్రత్యక్ష్యమవటానికి కారణం... అక్కడ సూర్య తాజా చిత్రం సికిందర్ కి చెందిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరగుతూండటమే అని చెప్తున్నారు. అలాగే బాహుబలి టీమ్ తమ సినిమాలో సూర్య చేయటం లేదని వెంటనే ఖండించింది.

బాహుబలి చిత్రం కథ సైతం అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరుగా తీర్చి దిద్దుతున్నారని తెలుస్తోంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

Whats with Surya and Bahubali

ప్రస్తుతం 'బాహుబలి' కోసం రామోజీ ఫిల్మ్‌సిటీ ఉడ్‌లాండ్‌ ప్రాంతంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇందులో చిత్ర ప్రధాన తారాగణమంతా ఉండబోతోంది. ఇప్పటికే నటీనటులకు పూర్తి శిక్షణ ఇచ్చిన రాజమౌళి యుద్ధానికి అందరినీ సన్నద్ధుల్ని చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజులు సెలవులు తీసుకున్న యూనిట్ మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకి ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు.

రెండు టీజర్లు ఇప్పటికే ఈ సినిమా 'రుచి' ఏమిటో చూచాయిగా చూపించాయి. తెర వెనుక ఎంత కష్టపడుతున్నారో వాటిని చూస్తుంటే అర్థమవుతూనే ఉంది. అందరి కష్టం ఒక ఎత్తయితే, ప్రభాస్‌ కష్టం మరో ఎత్తు. ఈ సినిమా కోసం బరువు పెరిగాడు. 'బాహుబలి' టైటిల్‌కి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి కఠోరశ్రమ చేశాడు. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలూ నేర్చుకొన్నాడు. రెండేళ్లపాటు కొత్తకథలేం వినకూడదని నిర్ణయించుకొన్నాడు. బహు కష్టజీవి అనిపించుకొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X