ఆసిన్‌ను పబ్లిక్‌గ్గా ముద్దుపెట్టున్నాడు (ఫోటో)
ముంబై: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అసిన్ కలిసి నటించిన సినిమా 'కిలాడీ 786'. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ ఈ చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. 12 సంవత్సరాల క్రితం అక్షయ్ కుమార్ 'కిలాడీ' అనే హిట్ చిత్రంలో నటించాడు. ఇప్పుడు మళ్లీ అదే పేరుతో సినిమా విడుదలవుతుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి.
ఇటీవల 'కిలాడీ 786' యూనిట్ సభ్యులు ముంబైలోని ఓ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసిన్‌ను పబ్లిక్ గా ఆమె మెడపై ముద్దు పెట్టుకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు. అయితే ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసమే చేసినట్లు స్పష్టం అవుతుంది. ఆ దృశ్యాన్ని మీరు ఈ ఫోటోలో వీక్షించొచ్చు.
'కిలాడీ 786' చిత్రానికి ఆశిష్ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, అసిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా మిథున్ చక్రవర్తి, రాజ్ బబ్బర్, హిమేష్ రేషిమియా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 7న ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











