»   » ప్రకాష్ రాజ్ భార్యగా యాంకర్ అనసూయ ఇలా...(వీడియో)

ప్రకాష్ రాజ్ భార్యగా యాంకర్ అనసూయ ఇలా...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :టీవి మీడియాలో యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. దాంతో ఆమె వెండి తెర ప్రయత్నాలు చేస్తోంది. అవెలా ఉన్నా..ఈలోగా యాడ్స్ చేస్తూ వెళ్తోంది. అందులో ఒకటి క్రింద మీరు చూడబోయేది. ఈ ఫిట్ 365 యాడ్ లో ఆమె ప్రకాష్ రాజ్ కు భార్యగా కనిపించింది. ఇది 2012లో చేసిన యాడ్. దీన్ని అనసూయ గుర్తు చేసుంది. దీన్ని చూస్తూంటే...తాను కెరీర్ ప్రారంభ రోజులు గుర్తు వచ్చాయంటాయి. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉందో ఈ వీడియో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్ షోలకు వ్యాఖ్యాతగా, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే విషయమై కామెంట్స్ చేసి మరీ అందరి దృష్టిలో మరోసారి పడింది. సినిమావాళ్లను సైతం ఆమె ఆకర్షించినా ఆచి,తూచి తన బుల్లి తెరకెరీర్ పై ముందుకు వెళ్తోంది. 

గతంలో ఆమె పవన్ కళ్యాణ్ చిత్రం చూసి సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ‘అత్తారింటికి దారేది' చిత్రంలో అనసూయను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె అప్పట్లో రిజెక్ట్ చేసి వార్తల్లోకి ఎక్కింది.

 When Anasuya acted as Prakash Raj’s wife

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అనసూయ పేరు వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో అందరినీ ఆకట్టుకుంటూ హాట్ టాపిక్ గా మారింది.

చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. అవే ఆమె ఎస్సెట్స్ గా ముందుకు వెళ్తోంది. అనసూయ వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతుస్తుంటాయి.

మరో ప్రక్క ఏదైనీ సినీ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వచ్చిందంటే... హీరోయిన్స్ వైపు చూసేవారే కరవు అవుతున్నారు. రీసెంట్ గా ఓ ముగ్గరు హీరోయిన్స్ ఇలా అనసూయ దెబ్బకు బలయ్యారు.

అనసూయ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివింది. ఆమె సుశాంత్ భరధ్వాజ్ ని వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె జనవరి 23,1985 లో జన్మించింది. పొట్టి డ్రస్ లలో, లేకపోతే పల్చటి చీరల్లో తన అందాలను చూపిస్తూ అదరకొడుతోంది. చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

మరో వైపు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ కూడా మెయింటేన్ చేస్తోంది అనసూయ. ఈ టీవీ లో ప్రసారమయ్యే... జబర్దస్త్ అనే కామెడీ రియాలటీ షో ద్వారా ఆమె పాపులారిటి తెచ్చుకుంది. అయితే తర్వాత ఆమెని తొలిగించి,రేష్మిని పెట్టుకున్నారు. ఇప్పుడూ ఇద్దరూ కలిసి ఓ పోగ్రాం చేస్తున్నారు.

English summary
In that advertisement TV anchor, Anasuya just acted as wife of Prakash Raj. Recalling those memories, Anusuya says that she feels nostalgic for all that work done during start of her career.
Please Wait while comments are loading...