రామ్ చరణ్ హీరోయిన్‍కి వార్నింగ్
ముంబై: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం 'జంజీర్'. ఈ చిత్రంలో చరణ్ సరసన రొమాన్స్ చేస్తోంది బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తాజాగా ప్రియాంక చోప్రాకు బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫరాన్ అక్తర్ నుంచి వార్నింగ్ వచ్చింది.
ఇటీవల జంజీర్ షూటింగులో భాగంగా ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చింది. ఇక్కడికి చేరిన తర్వాత ప్రియాంక చోప్రా తన ట్విట్టర్లో... 'జంజీర్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. ప్రతి కొత్త సినిమా స్టార్టింగ్ నన్ను నర్వస్ చేస్తోంది' అంటూ ట్వీట్ చేసింది.
ప్రియాంక చోప్రా ట్వీట్‌పై ఫరాన్ అక్తర్ తన ట్విట్టర్లో స్పందిస్తూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. 'ప్రియాంక చోప్రా... నీకు అర్థం అవుతోందా? ఇది మూడో సారి నీకు అమితాబ్ నటించిన రీమేక్ చిత్రంలో అవకాశం దక్కడం, జాగ్రత్తగా ఉండు, నువ్వు అలా చేస్తే మళ్లీ నీకు ఇలాంటి అవకాశాలు రాక పోవచ్చు' అంటూ ట్వీట్ చేసాడు.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. తాజాగా ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ప్రియాంక చోప్రా అమితాబ్ నటించిన డాన్(1978), అగ్నిపథ్(1990) చిత్రాలకు రీమేక్ గా వచ్చిన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. జంజీర్ రీమేక్ ఆమె నటిస్తున్న మూడవ చిత్రం.


Click it and Unblock the Notifications











