ఫిలాసఫి మాట్లాడుతున్న మహేష్ హీరోయిన్..!?
రామ్ చరణ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ తరువాత వివి వినాయక్ డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు 'ఏ మాయ చేసావే", 'బృందావనం", 'దూకుడు" వరుసగా మూడు హిట్ సినిమాలలో నటించిన హీరోయిన్ సమంతకు కోటి ఇవ్వడానికి నిర్మాత ఒకే అన్నారని ప్రచారం జరిగింది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తెలుగు ఫిల్మిం ఇండస్ట్రీలో పేరుతెచ్చుకొన్న క్యూట్ సమంతని దర్శకుడు గౌతమ్ మీనన్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'ఏ మాయ చేసావె"తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత 'దూకుడు" చిత్రంతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రాజమౌళి 'ఈగ" , నాగ చైతన్య 'ఆటో నగర్ సూర్య" సినిమాలలో కూడా నటిస్తుంది.
'సినిమా పరిశ్రమలో మన టాలెంట్ కంటే అదృష్టం ముఖ్యం. అందం, అభినయం కంటే కూడా ఇక్కడ లక్ అవసరం. నాకంటే అందమైన వారు చాలా మంది పరిశ్రమలో వున్నారు. అదృష్టం కలసివస్తేనే ఎవరైనా ఇక్కడ సక్సెస్ సాధించగలరు" అని అంటోంది చైన్నై భామ సమంతా. కేవలం మూడు సినిమాలతోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఈ సుందరి. 'దూకుడు" విజయంతో కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట కదా? అని ఆడిడితే...'కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఎవరైనా ఇస్తామని ముందుకు వచ్చినా నేను స్వీకరించను. ఎందుకంటే నేనింకా ఆ స్థాయికి చేరుకోలేదని నా అభివూపాయం. నా ఒక్కదాని వల్లే కోటి రూపాయల టిక్కెట్లు అమ్ముడవుతాయన్న రోజున నేను కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకుంటానని" చెప్పింది.
విధి తన పట్ల ఔదార్యం చూపెడుతోందని, అందుకే మంచి సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని, నటిగా తనకున్న పరిమితులు తనకు తెలుసునని అందుకు తగినట్లుగానే భవిష్యత్తులో నడచుకుంటానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఏదిఏమైనా సక్సెస్ తో పాటు ఈ భామ ఫిలాసఫీని కూడా వంటబట్టించుకుందని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











