రామ్ చరణ్ మీద కోపం వస్తే ఉపాసన ఏం చేస్తుందో తెలుసా?
రామ్ చరణ్ మీద కోపం వచ్చినపుడు ఏం చేస్తానో చెబుతూ ఉపాసన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
Recommended Video

భార్యాభర్తల మధ్య కోపాలు, తాపాలు, చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణం. భర్తపై కోపం వస్తే భార్యలు తమదైన రీతిలో రియాక్ట్ అవుతారు. అయితే రామ్ చరణ్ మీద కోపం వస్తే మాత్రం ఉపాసన ఓ ఫోటోను చూస్తుందట. ఆ ఫోటో మరేదో కాదు... రామ్ చరణ్ చిన్ననాటి ఫోటో.
అపోలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన.... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ప్రొఫెషన్‌కు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు.

మిస్టర్ సి మీద కోపం వస్తే
ఎప్పుడైనా మిస్టర్.సి మీద కోపం వస్తే ఎంతో క్యూట్ గా ఉండే ఈ ఫొటోను చూస్తాను. క్షణాల్లో కోపమంతా కరిగిపోతుంది... అంటూ రామ్ చరణ్ చిన్ననాటి ఫోటోను ఉపాసన షేర్ చేసింది.

ఫ్యాన్స్ ఫిదా
రామ్ చరణ్ చిన్ననాటి ఫోటో చూసి ఉపాసన మాత్రమే కాదు, చెర్రీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. చిన్నతనంలో రామ్ చరణ్ చాలా అందంగా ఉన్నాడని, ముద్దొస్తున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.

మై స్వీటెస్ట్ కజిన్ అంటూ..
నా స్వీటెస్ట్ కజిన్స్‌లో ఇతడు కూడా ఒకరు. గుర్తుపట్టండి చూద్దాం? అంటూ...... ఇటీవల హాలోవీన్ ఫెస్ట్ సందర్భంగా వరుణ్ తేజ్ ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్టు చేసింది ఉపాసన. చరణ్‌తో మాత్రమే కాదు, అతడి కుటుంబ సభ్యులతో కూడా ఉపాసన ఎంతో క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తుందని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.

పెళ్లి తర్వాత చాలా మారిన ఉపాసన
రామ్ చరణ్‌తో పెళ్లి తర్వాత ఉపాసనలో చాలా మార్పు వచ్చింది. అటు వృత్తి పరంగా సరికొత్త బాధ్యతలు చేపట్టడంతో పాటు విమర్శకుల నోరు మూయిస్తూ ఫిట్‌నెస్ విషయంలో కూడా చాలా శ్రద్ద తీసుకుంటోంది.


Click it and Unblock the Notifications











