ఇలియానా ఆత్మహత్యా ప్రయత్నం?: సైకిక్ డిసీజ్ వల్లనే
ఇలియానా ఒక దశలో మాత్రం విపరీతమైన డిప్రెషన్ లో పడిపోయిందట. అదీ తన జీవితాన్నే అంతం చేసుకోవాలనుకునేంత డిప్రెషన్ లో పడిపోయిందట, ఈ విషయాన్ని తనే చెప్పింది.
Recommended Video

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్టార్ స్టేటస్ మొదటి సినిమాతోనే తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా తన కాన్ ఫిడెన్స్ లెవెల్ ని మొదటినుంచీ అస్సలు తగ్గనివ్వలేదు. ఇక్కడ మంచి ఫాలోయింగ్ నీ పెద్ద ఆఫర్లనీ వదులుకొని బాలీవుడ్ వైపు అడుగులేసింది అయితే అక్కడ తనకి రెడ్ కార్పెట్ ఏమీ వెయ్యలేదు బర్ఫీ, రుస్తుం లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత కూడా ఇలియానాకి కోరుకున్న స్థాయిలో ఆఫర్లు రాకపోయినా మరీ వరస్ట్ అనుకునే పరిస్థితైతే రాలేదు గానీ ఆమెకు ఉండాల్సినంత గుర్తింపు రావటం కాస్త ఆలస్యం అయ్యింది.

ఒక డిసార్దర్ కారణంగా
అయితే ఇన్ని సమస్యలని ఎదుర్కోవటం లోనూ తన మానసిక స్థైర్యాన్ని కోల్పోని ఇలియానా ఒక దశలో మాత్రం విపరీతమైన డిప్రెషన్ లో పడిపోయిందట. అదీ తన జీవితాన్నే అంతం చేసుకోవాలనుకునేంత డిప్రెషన్ లో పడిపోయిందట, ఈ విషయాన్ని తనే చెప్పింది అయితే తర్వాత ఆ ఫీలింగ్సన్నీ ఒక డిసార్దర్ కారణంగా అని తర్వాత అర్థమైందట.

బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్
తన జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా భావించినట్లు చెబుతోంది ఇల్లీ. అయితే.. దీనికి కారణం ఏంటనేది మొదట్లో తనకు తెలియదని.. బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ కారణంగా.. అంటే తన శరీరంపై తనకు ఉన్న ఆలోచనల కారణంగానే ఇలా చేసినట్లు తర్వాత తెలిసిందని చెప్పింది.

ఆ డిసీజ్ కూడా ఒక కారణం
ఒకసారి ఈ విషయం అర్ధమైన తర్వాత.. ఏ మాత్రం ఆలోచించకుండా.. డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకున్నానని.. తను ఎలా ఉందో అలాగే స్వీకరించాలనే విషయాన్ని తెలుసుకుందట. ఆ సమయంలో తన ఆలోచనల్లో ఒక మెచ్యూరిటీ రావటానికి ఆ డిసీజ్ కూడా ఒక కారణం అని రియలైజ్ అయ్యిందట.

మెదడులో కెమికల్ బ్యాలెన్స్
డిప్రెషన్ ఉన్నపుడు తీరుబాటుగా కూర్చుంటే సరిపోదని.. మెదడులో కెమికల్ బ్యాలెన్స్ సరిగా లేనపుడే ఇలాంటి పరిస్థితి వస్తుందన్న గోవా బ్యూటీ. డిప్రెషన్ ఉన్నపుడు కచ్చితంగా సహాయం తీసుకోవాలని చెబుతోంది. తనకు తన తల్లి ఈ విషయంలో చేసిన సాయం ఎన్నటికీ మరిచిపోలేనని అంటోంది ఇలియానా.


Click it and Unblock the Notifications











