For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పంక్షన్ లో అభాసు పాలైన ప్రభాస్ హీరోయిన్, కారణం ఆమె వేసుకున్న డ్రస్ (ఆ ఫొటోలు)

  By Srikanya
  |

  ముంబై: రైటే అందరినీ ఆకట్టుకోవాలి, సెలబ్రెటీలుగా అందరి దృష్టిలో పడాలనే ఉంటుంది. తప్పు లేదు కానీ అందుకోసం మరీ దారుణమైన డ్రస్ లలోకనపడితే జనం షాక్ అవరూ. మాటలు అనేయరూ. ముఖ్యంగా ఇలాంటి వాటి కోసమే కాసుకు కూర్చున్నట్లుండే మీడియా ఊరుకుంటుందాం. ఆ డ్రస్ లను హైలెట్ చేస్తూ కథనాలు వెలువరించేయదు. ఇప్పుడు కంగనా రనౌత్ కి అదే జరుగుతోంది. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించిన ఈ భామ తెలుగులో తర్వాత కనపడలేదు. బాలీవుడ్ మాత్రం ఫుల్ బిజీ.

  ఇక అసలు విషయానికి వస్తే....సాధారణంగా కంగనా ఏ డ్రస్సులు వేసినా కూడా సూపర్ ఉంటుంది. కర్లీ హెయిర్ బ్యూటి కంగనా రనౌత్ అందుకే ఎప్పుడూ కొత్త కొత్త డ్రస్ డిజైన్లతో మనలని అలరించే ప్రయత్నం చేస్తూంటుంది. అమ్మడు ఎలాంటి డ్రస్ వేసినా కూడా..అదిరిపోతుంది అంటారు అభిమానులు. అయితే అలాంటి అబిమానులు కూడా ఇప్పుడు ఆమె డ్రస్ ని చూసి షాక్ అయ్యారు.

  కంగనాని కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తున్నవారు... ఆమె ఫ్యాషన్ రోజురోజుకూ శ్రుతిమించుతోంది అని కామెంట్లు చెస్తున్నారు. అందరిలో అందంగా కనిపించాలని ఆమె పడే తాపత్రయంతో చేసే చేష్టల వల్ల చివరికి అభాసుపాలవుతోందంటున్నరు. ముఖ్యంగా ఆమె పెద్ద పెద్ద ఫంక్షన్లకు, ఆడియో రిలీజ్‌లకు హాజరయ్యే తీరు చూస్తే ఎబ్బెట్టుగా అనిపించక మానదు.

  కొద్దిరోజుల క్రితం కంగనా రనౌత్ ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైంది. ఆమె ధరించిన డ్రస్ చూసి చాలామంది షాక్ అయ్యారు. ఆ పొటోలు మీరు క్రింద చూడండి. ఎంత ఎబ్బెట్టుగా అబాసుపాలయ్యేలా ఆమె డ్రస్సింగ్ చేసుకువచ్చిందో అని మీకు అనిపించకమానదు. మీరు కంగనా అబిమాని అయినా సరే ఈ సారికు ఆమెను తిట్టుకోకుండా ఉండలేరు.

  క్రింద కంగనాని అభాసుపాలు చేసిన డ్రస్ చూడండి...

  ఆమెకైనా ఎలా నచ్చిందబ్బా

  ఆమెకైనా ఎలా నచ్చిందబ్బా

  బాలీవుడ్‌లో స్కిన్ షో అనేది సహజం అనేది అందరూ ఒప్పుకునే నిజం. ఇటీవల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వేసుకున్న డ్రస్‌పై సినీజనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి డ్రస్ కంగనాకెలా నచ్చిందో అర్దం కాక ఆశ్చర్యపడ్డారు. ఓ రకంగా ఈ డ్రస్ ఆమెను అభాసు పాలు చేసింది.

  పాపం పరార్

  పాపం పరార్

  బ్యాక్‌లెస్ ధరించి ఫంక్షన్‌కు రావడం అనేది పెద్ద విశేషం కాదు కానీ ఇంత వెరీటీ డ్రస్ లో రావటం మాత్రం అందరూ మాట్లాడుకోవటానికి కారణమైంది. పాపం అక్కడున్న జనాల రియాక్షన్ చూసి ఆ డ్రస్ ధరించిన కంగనా సిగ్గుతో అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయిందట.

  కొత్త తలనొప్పి పట్టుకుంది

  కొత్త తలనొప్పి పట్టుకుంది

  కంగనా బయిటకువచ్చే ముందు తను ఏం డ్రస్ వేసుకుందో చూసుకోలేదా...అయినా అలాంటి డ్రస్‌లు వేసుకోవడం ఎందుకు? అలా అభాసుపాలవటం ఎందుకని సినీజనం మాట్లాడుకుంటున్నారు. అంతేకాక ఆమెతో పరిచయమున్నవాళ్లు ఓ అడుగు ముందుకేసి సలహాలు సైతం ఇస్తున్నారట. దీంతో ఇదో కొత్త తలనొప్పి పట్టుకుందని కంగనా తలపట్టుకుందిట.

  డైరక్టర్ గా మారుతోంది కదా అని..

  డైరక్టర్ గా మారుతోంది కదా అని..

  ప్రస్తుతం రంగూన్ సినిమా షూటింగులో పాల్గొంటున్న కంగనా.. త్వరలోనే తన డైరక్షన్లో కొత్త సినిమాను కూడా మొదలెడతానని చెబుతోంది. ఈ మధ్యన హీరో హృతిక్ తో ఏర్పడిన వివాదంలో కాస్త సైలన్స్ వినిపించడంతో.. ఇప్పుడు అమ్మడు బాగా ప్రశాంతంగా ఉంటోందట. తన డైరక్షన్ లో రాబోయే చిత్రానికి ఆమె మెరుగులు దిద్దుకుంటోంది.

  హౌస్ కీపర్ టు క్రైమ్

  హౌస్ కీపర్ టు క్రైమ్

  బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సిమ్రాన్‌' చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. హన్సల్‌ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ వూహించని పరిస్థితుల్లో ఎలా నేర ప్రపంచంలోకి చేరిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కంగనా.. గుజరాత్‌కి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో కంగనా నెగిటీవ్‌ పాత్రను పోషిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

  'సిమ్రాన్‌' వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ఆ వీడియో తో వచ్చిన పేరంతా

  ఆ వీడియో తో వచ్చిన పేరంతా

  లక్ష్మీదేవిని అందరూ పూజిస్తారు.. కానీ పరిశుభ్రత గురించి ఎందరు పట్టించుకుంటారు? అందుకే లక్ష్మీదేవి ద్వారా స్వచ్ఛభారత్‌ ప్రచారాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలనుకున్నారు.. ఆ ఆలోచనతో రూపొందిందే ఓ వీడియో ని విడుదల చేసారు. ఇందులో కంగనా రనౌత్‌ లక్ష్మీదేవిగా కన్పించింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ పథకానికి ఇప్పుడు కంగనా రనౌత్‌, అమితాబ్‌ బచ్చన్‌లను బ్రాండ్‌ అంబాసడర్లుగా ఉపయోగించుకుంటూ పబ్లిక్‌ సర్వీస్‌ అనౌన్స్‌మెంట్‌ సంస్థ ఈ వీడియో రూపొందించింది. ఆ వీడియోతో ఆమెకు దేశం మొత్తం మంచి పేరు వచ్చింది.

  వేలెత్తి చూపెట్టలేనంతగా

  వేలెత్తి చూపెట్టలేనంతగా

  రీసెంట్ గా కంగన మాట్లాడుతూ తాను తమన్నాకు బిగ్ ఫ్యాన్‌నని చెప్పింది. తమన్నా పనితీరు కూడా తనకు చాలా ఇష్టమని తెలిపింది. ఆమె నటించిన సినిమాలను చూస్తూ ఉంటానని చెప్పింది. వేలెత్తి చూపించడానికి వీల్లేనంత గొప్పగా తమన్నా నటిస్తుందని పొగిడేసింది. అలాంటి సీన్‌ కోసం చూస్తున్నానని చెప్పింది.ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన తూతక్ తూతక్ తూతియా నిర్మాత సోనూ సూద్.

  హీనాతి హీనంగా చూసారు

  హీనాతి హీనంగా చూసారు

  ప్రస్తుతం రంగూన్ వంటి టాప్ క్లాస్ సినిమాల్లో నటిస్తున్న కంగన.. మొన్న ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడుతూ.. ''అసలు నన్ను మా ఇంట్లో ఒక అనవసరంగా పుట్టిన ప్రాణంలా చూశారు.. హీనాతి హీనమైన బాల్యంను అనుభవించా'' అంటూ చెప్పుకొచ్చింది. అందరూ షాక్ అయ్యారు.

  ప్రభాస్ ప్రక్కన చేయాలంటే కోటి

  ప్రభాస్ ప్రక్కన చేయాలంటే కోటి

  ఫ్యాషన్ సినిమాకి గాను నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్నా చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి కంగనాది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే హైద్రాబాద్ వచ్చి ఏక్ నిరంజన్ అనే తెలుగు సినిమాలో ప్రభాస్ సరసన నటించింది కంగనా. తిరిగి ముంబై వచ్చి.. తన బోయ్ ఫ్రెండ్ అధ్యయన్ సుమన్ దగ్గర ఉన్న కార్ లాంటిదే కొనిందట కంగనా రనౌత్. అదీ తెలుగులో కంగనా చేయటానికి కారణం అని చెప్తున్నాడు బోయ్ ఫ్రెండ్.

  దేశాన్ని ప్రేమించమంటూ

  దేశాన్ని ప్రేమించమంటూ

  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కంగనా మరో వీడియో ఆల్బమ్‌లో నటించింది. సామాజిక రుగ్మతలుగా మారిన అత్యాచారాలు.. భ్రూణ హత్యలు.. బాల్య వివాహాలు.. వరకట్నం తదితర సమస్యలను 'లవ్‌ యువర్‌ కంట్రీ' అనే ఈ ఆల్బమ్‌లో ప్రస్తావించింది. ఇందులో నటించిన చిన్నారులు, సామాన్య పౌరులు త్రివర్ణ పతాకాన్నిచేతబూని దేశ స్వాతంత్య్రాన్ని కీర్తిస్తుంటారు. ఇంటర్ నెట్ లో విడుదలైన 'లవ్‌ యువర్‌ కంట్రీ' ఆల్బమ్‌ నిడివి మూడు నిమిషాలు. ఇందులో కంగనా తన లిప్‌ సింక్‌తో పాటను అందుకుని చివర్లో లవ్‌ యువర్‌ కంట్రీ (నీ దేశాన్ని ప్రేమించు) అనే సందేశాన్నిస్తుంది.

  కంగనాకు ఆ సిండ్రోమ్

  కంగనాకు ఆ సిండ్రోమ్

  గత కొంత కాలంగా వాడి వేడి చర్చనీయాంశమైన హృతిక్‌, కంగనల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. హృతిక్‌ పేరుతో కంగనాకి వచ్చిన మెయిల్స్‌ అన్నీ ఫేక్‌ అని, హృతిక్‌ పేరిట ఎవరో నకిలీ ఎకౌంట్‌ తెరిచి కంగనాకు ఈ మెయిల్స్‌ పంపినట్లు రుజువైంది. మరో పక్క తప్పంతా కంగనాదే అనిపిస్తోంది. వీరి వ్యవహారానికి సంబంధించి కొన్ని మెయిల్స్‌ లీకయ్యాయి. వాటిని బట్టి చూస్తే హృతిక్‌కి కంగనా నుంచి 3000 మెయిల్స్‌ వెళ్లాయి. తనకి యాస్పర్జర్స్‌ సిండ్రోమ్‌ ఉందంటూ ఆ మెయిల్స్‌లో కంగన పేర్కొంది.

  ఇదేం జబ్బో

  ఇదేం జబ్బో

  హృతిక్‌ కంగనాకి ఏడేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఫోన్‌ చేశాడని, ఇద్దరికీ పారిస్‌లో నిశ్చితార్థమైందని కంగనా చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆ సమయంలో హృతిక్‌ అసలు పారిస్‌లోనే లేడని అతని పాస్‌పోర్టును పరిశీలిస్తే తేలినట్లు పోలీసులు వెల్లడించారు. కంగన ఒకలాంటి బంధాన్ని వూహించుకుని దాని చుట్టూ కథలు అల్లుకున్నట్లు స్పష్టమవుతోంది.

  కంగనా నాకు ఆదర్శం అంటూ డైరక్టర్

  కంగనా నాకు ఆదర్శం అంటూ డైరక్టర్

  'తను వెడ్స్‌ మను'.. 'తను వెడ్స్‌ మను రిటర్న్‌' వంటి పలు చిత్రాలతో బాలీవుడ్‌లో ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తాజాగా ఆయన.. బాలీవుడ్‌ క్వీన్‌ జీవితం ఎందరికో ఆదర్శమంటూ కంగనా ఎదుగుదల గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ''కంగానాను చూస్తుంటే గర్వంగా ఉంటుంది. తన పని నియంత్రణ బాగుంటుంది. ఈ స్థాయిని దక్కించుకోవటం కోసం కంగనా అనుక్షణం శ్రమించేది. గత ఐదారేళ్లలో నటిగా ఆమె ఎదుగుదలను పోలిస్తే.. మరే నటికి రానటువంటి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. కంగనా స్వతంత్రురాలు. తెలివైన అమ్మాయి. ఆమె జీవితం కొత్తవారికే కాదు నాకూ ఆదర్శమే'' అంటూ ఆమెపై తన అభిమానాన్ని పంచుకున్నాడు.

  మాజీ బోయ్ ఫ్రెండ్ ఇలా అన్నాడు

  మాజీ బోయ్ ఫ్రెండ్ ఇలా అన్నాడు

  ఓసారి హృతిక్‌ పుట్టినరోజు సందర్భంగా అధ్యయన్‌, కంగనాని పార్టీకి ఆహ్వానించాడు. అప్పుడు అధ్యయన్‌ హృతిక్‌ కోసం బొకే, ఖరీదైన షాంపెయిన్‌ బాటిల్‌ తీసుకెళ్లాడు. అందరూ కలిసి మాట్లాడుతుండగా ఉన్నట్టుండి కంగనా అధ్యయన్‌ తెచ్చిన బొకె, షాంపెయిన్‌ బాటిల్‌ను హృతిక్‌కి ఇచ్చి విషెస్‌ చెప్పిందట. కనీసం తనని హృతిక్‌కి పరిచయం కూడా చేయలేదని వివరించాడు అధ్యయన్‌.

  కంగానాకు నోటి దూలే

  కంగానాకు నోటి దూలే

  ఆ మధ్య కంగనా మాట్లాడుతూ 'రంగూన్‌' అనే సినిమాలో ముగ్గురు హీరోలు నటించనున్నారని, వారిలో తను (కంగనా) ఒకరు కాగా, మిగతా ఇద్దరు హీరోలు సైఫ్‌ ఆలీ ఖాన్‌, షాహిద్‌ కపూర్‌ అంది. మూడు జాతీయ అవార్డులు, నాలుగు ఫిలింఫేర్‌ బహుమతులు అందుకున్న కంగనా ఇలా మాట్లాడడం సమంజసమేనా అనేది బాలీవుడ్ ప్రశ్న.

  నావెనక ఏం మాట్లాడినా

  నావెనక ఏం మాట్లాడినా

  ‘‘మనల్ని కించపర్చేవారు ప్రతీ చోటా ఉంటారు. స్కూల్‌.. కాలేజీ.. ఆఫీసు.. ఎక్కడైనా ఉంటారు. వారందరినీ దాటుకొని మనం ముందుకు సాగాలి. అది సాధారణంగా జరిగే విషయమే. నా వెనక నా గురించి ఎవరు ఎన్ననికున్నా నేను పట్టించుకోను. నా జీవితం ఉన్నది నా కోసం. నా వెనక జరిగే విషయాల గురించి బుర్ర బద్దలు కొట్టుకోవడం అనవసరం అని తేల్చి చెప్పింది.

  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో

  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో

  బాలీవుడ్‌కి వచ్చిన కొత్తలో పరిశ్రమలోని ప్రధాన వ్యక్తుల నుంచి చాలా బాధ‌లు ప‌డ్డాను..ఈ పెద్ద మ‌నుషుల‌ను తొలగించ‌డ‌మే ప్ర‌స్తుతం త‌న ల‌క్ష్య‌మంటున్న‌ది.. వాళ్లు పోతేనే ఫీల్ట్ లో నాలాంటి వాళ్ల‌కు క‌ష్టాలు తొలుగుతాయంటున్న‌ది. ఇంత‌కీ ఆ పెద్ద‌ల పేర్లు చెప్ప‌మంటే మౌనంగా ఉండ‌పోయిందీ క్వీన్..

  స్టార్ డైరక్టర్ కు, హీరోకు ట్విస్ట్

  స్టార్ డైరక్టర్ కు, హీరోకు ట్విస్ట్

  షారుక్‌, బన్సాలీ కాంబినేషన్‌ లో చారిత్రక కథాంశంతో ‘పద్మావతి' అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్స్ లో ఒకరిగా కంగనా రనౌత్‌ ని సంప్రదించారట భన్సాలీ. ఎంతటి స్టార్‌ హీరోయిన్‌ కైనా ఇది ప్రతిష్ఠాత్మక సినిమానే. భన్సాలీ అడగ్గానే ‘పద్మావతి' సినిమా చేసేందుకు అంగీకరించింది కంగనా. అయితే ఇప్పటివరకు షూటింగ్‌ చేసే తేదీలు ధృవీకరించలేదు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ బీజీగా ఉన్న షారుక్‌ ఖాన్‌ ‘పద్మావతి' కోసం డేట్స్‌ సర్దుకోగా, ఈ ‘క్వీన్‌' నాయిక మాత్రం ఇంకా నాన్చుతూనే ఉంది.

  ఏ సినిమా కమిటవ్వలేదు

  ఏ సినిమా కమిటవ్వలేదు

  ప్రస్తుతం కంగనా రనౌత్‌ రంగూన్‌ అనే సినిమా చేస్తోంది. ఆమె ఇప్పుడు చేస్తున్న చిత్రం ఇదొక్కటే. పైగా రెండేళ్ల కిందట కట్టి బట్టి తర్వాత ఆమె ఏ సినిమా అంగీకరించలేదు. రంగూన్‌ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత తన తేదీల విషయంలో కంగనాకు ఓ స్పష్టతకు రానుంది.

  బ్రాను బ్లర్ చేయటమేంటండి

  బ్రాను బ్లర్ చేయటమేంటండి

  ''క్వీన్'' సినిమా కోసం ఓ సీన్ కన్సీవ్ చేశాడు దర్శకుడు వికాస్ బాల్. స్వయంగా కంగనా రనౌత్ ఈ సీన్ లో నటించింది. సినిమాలో సీన్ సూపర్ హిట్టు. కాని ఈ సీన్ చూస్తే అక్కడ బ్రా ను డిజిటల్ గా బ్లర్ చేయడం మనం చూడొచ్చు. ''ఆ సీన్లో అసలు బ్రా బ్లర్ చేయడమేంటండీ? దాని వలన జనాలకు ఏమన్నా నష్టం ఉందా? నా బ్రా చూస్తే ఇప్పుడు జనాలు పాడైపోతారా? అసలు సెన్సార్ బోర్డు వారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కంగన.

  English summary
  Recently Bollywood’s ‘queen’ Kangana Ranaut was spotted wearing a backless dress at an award event in Mumbai! The actress’s brilliant acting skills and unique style statement always keep her stand out from the crowd. Check out her hot pics in this attire
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X